పవన్ చంపేస్తున్నాడండీ బాబూ
on Mar 28, 2015
మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అని బాలీవుడ్‌లో అమీర్ ఖాన్ గురించి చెప్పుకొంటారు. టాలీవుడ్‌లో ఆ ట్యాగ్‌లైన్ పవన్ కల్యాణ్‌కి తగిలించేయొచ్చేమో..?? ఎందుకంటే ఆయన 'గబ్బర్ సింగ్ 2' కోసం అనుసరిస్తున్న వ్యూహాలు అలా ఉన్నాయ్ మరి. ఈ సినిమా కోసం రెండేళ్ల నుంచీ కసరత్తు చేస్తూనే ఉన్నాడు పవన్. ఇప్పటికి అరడజను సార్లు స్ర్కిప్టు మార్చాడు. ఒక డైరెక్టరును పక్కన పెట్టి మరో డైరెక్టరుని ఎంచుకొన్నాడు. అయినా ఈ ప్రాజెక్టు ఇసుమంత కూడా ముందుక కదల్లేదు. పవర్ ఫేమ్ బాబి... గబ్బర్ సింగ్ 2 స్ర్కిప్టు లో తలమునకలైపోయాడు. పవన్ కి ఇప్పటికే పలు దఫాలు స్ర్కిప్టు వినిపించాడు. పవన్ ఆదేశాలఅనుసారం మార్పులు చేర్పులూ చేశాడట. అయినా పవన్ కి ఎక్కడం లేదు. 'పవన్ కల్యాణ్ అంత పర్‌ఫెక్షనిస్ట్‌ని ఎక్కడా చూళ్లేదురా బాబూ..' అంటూ సన్నిహితుల దగ్గర చెప్పుకొంటున్నాడట బాబి. ఈపాటికి బాబి హాయిగా మరో సినిమా చేసేద్దుడు. కానీ.. పవన్ దగ్గర అడ్డంగా బుక్కయిపోయాడు. అసలు పవన్‌కి సినిమాలు చేసే మూడ్ లేదని, ఆయన ధ్యాసంతా మిగిలిన విషయాలపై కేంద్రీకృతమయ్యిందనే గుసగుసలూ వినిపిస్తున్నాయి. స్ర్కిప్టు రెడీ అయినా పవన్.. మూడ్ సరిగా లేదని, అందుకే గబ్బర్ సింగ్ 2కి ఇంకా పచ్చజెండా ఊపలేదని ఆయన సన్నిహితులే చెబుతున్నారు. దాంతో గబ్బర్ సింగ్ 2కి పూర్తిగా పక్కన పెట్టేశాడన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. అయితే.. 'గబ్బర్ సింగ్2'ని పక్కన పెట్టలేదని, పవన్ చేసే తదుపరి సినిమా ఇదేనని.. శరత్‌మరార్ సన్నిహితులు పవన్ అభిమానులకు మాట ఇస్తున్నారు. పవన్‌కి కెమెరా ముందుకొచ్చే మూడ్ ఎప్పుడొస్తుందో, ఈ గబ్బర్ సింగ్ ఎప్పుడు మొదలవుతుందో దేవుడికే తెలియాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
