నయనతార మతిపోగోడుతోంది
on Apr 3, 2015
థర్టీ ప్లస్‌లో పడితే హీరోయిన్ల పనైపోయినట్లే అంటుంటారు. కానీ అది పాత కథ. ఇప్పుడు సీన్ మారింది. ఏజ్ పెరిగే కొద్దీ క్రేజ్ పెరిగిపోతోంది చాలామంది హీరోయిన్లకు. హిందీలో కరీనాకపూర్, ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్ లాంటి హీరోయిన్లు ఇప్పటికే థర్టీప్లస్‌లో పడినా జోరు కొనసాగిస్తున్నారు. సౌత్‌లో థర్టీప్లస్ హీరోయిన్ల జోరు మరింత ఎక్కువగా కనిపిస్తోంది. అనుష్క, త్రిష, నయనతార ఒకరిని మించి ఒకరు దూసుకెళ్లిపోతున్నారు. ఐతే అందర్లోకి ఎక్కువ జోరు నయనతారదే. ఆమె ప్రస్తుతం తమిళ, మలయాళ భాషల్లో కలిపి ఏకంగా ఏడు సినిమాల్లో నటిస్తోంది. విశేషమేంటంటే.. ఈ ఏడు సినిమాలు వచ్చే మూడు నెలల వ్యవధిలో విడుదల కాబోతున్నాయి.నిర్మాత, నటుడు ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి నటించిన నన్బేండా ముందు విడుదలవ్వగాగా.. ఆ తర్వాత మమ్ముట్టితో చేసిన భాస్కర్ ద రాస్కెల్, సూర్య సరసన నటించిన మాస్, తొలిసారి హార్రర్ పాత్రలో చేసిన మాయ, మాజీ ప్రియుడు శింబుతో జతకట్టిన ఇదు నమ్మ ఆళు, విజయ్ సేతుపతికి తొలిసారి జోడీగా నటించిన నానుమ్ రౌడీదా, జయం రవి హీరోగా చేసిన తనీ ఒరువన్ ఒకదాని తర్వాత ఒకటి విడుదల కాబోతున్నాయి. సౌత్ ఇండియాలో ఓ హీరోయిన్ నటించిన ఏడు సినిమాలు ఒకే ఏడాది విడుదలవడమే ఆశ్చర్యం కలిగించే విషయమంటే.. మూడు నెలల వ్యవధిలో ఇవన్నీ ప్రేక్షకుల ముందు రాబోతుండటం ఇంకా పెద్ద విచిత్రం.