10 ఇయర్స్ తరువాత త్రిషతో రొమాన్స్
on May 5, 2015
రెండేళ్ల కిందటి వరకు అవకాశాల్లేక ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పేసేలా కనిపించిన త్రిష.. ఇప్పుడు అవకాశాల వెల్లువలో తడిసి ముద్దయిపోతుండటమే ఆశ్చర్యం కలిగించే విషయం. ఇప్పటికే అరడజను సినిమాలు ఆమె చుట్టూ రౌండ్లు కొడుతున్నాయి. ఇప్పుడు ఇంకో క్రేజీ ఆఫర్ త్రిష ముందుకొచ్చి వాలింది. తన 32వ పుట్టిన రోజు సందర్భంగా ఈ కొత్త ప్రాజెక్టు గురించి ఉత్సాహంగా చెప్పుకొచ్చింది త్రిష. ప్రముఖ దర్శకుడు సుందర్.సితో త్రిష తొలిసారి సినిమా చేస్తోందట. ఇది హన్సిక ప్రధాన పాత్రలో సుందర్ తీసిన ఆరణ్మయికి (తెలుగులో చంద్రకళ పేరుతో వచ్చింది) సీక్వెల్ అట. విశేషమేంటంటే.. ఈ సినిమాలో సిద్దార్థ్ హీరోగా నటించబోతున్నాడు. త్రిష, సిద్ధు ఇంతకుముందు రెండు సినిమాలు చేశారు. ఒకటి యువ అయితే.. ఇంకోటి నువ్వొస్తానంటే నేనొద్దంటానా. దాదాపు పదేళ్ల తర్వాత ఇద్దరూ జత కట్టబోతున్నారన్న మాట. క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా తమిళ జనాల దృష్టిని బాగానే ఆకర్షిస్తోంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
