రభస విషయంలో ఎన్టీఆర్‌ని మోసం చేశారా?
on Oct 29, 2014
పాపం.... రభస సినిమా ఎన్టీఆర్‌కి చేదు జ్ఞాపకాల్ని మిగిల్చింది. షూటింగ్ సమయంలో దర్శకుడు దూరమైతే తాచే 'చేయి' చేసుకొని కొంత సినిమా లాగించినా, సినిమా ఫ్లాపయ్యాక ఈ సినిమాకోసం తన పారితోషికంలో కొంత 'త్యాగం' చేసినా - రభస విషయంలో ఎన్టీఆర్‌కి మోసమే మిగిలింది. ఈ సినిమా వల్ల భారీగా నష్టపోయానని నిర్మాత బెల్లంకొండ సురేష్ బిల్డప్ ఇస్తున్నా, నిజానికి ఈ సినిమా వల్ల ఆయన లాభాలే వెనకేసుకొన్నారని ఇన్ సైడ్ టాక్. ఈ సినిమాని తక్కువ బడ్జెట్‌లో చుట్టేసిన నిర్మాత, ఎన్టీఆర్ క్రేజ్‌ని ఆసరాగా చేసుకొని భారీ లాభానికి అమ్ముకొన్నాడట. కనీసం రూ.10 కోట్లయినా ఈ సినిమా విషయంలో లాభపడ్డాడని టాక్. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఈ సినిమాకి పెట్టిన డబ్బుల్లో ఒక్క రూపాయి కూడా బెల్లంకొండది లేదట. అన్నీ బినామీ పేర్లతో నడిపినవే అట. చివరికి మంచి సొమ్ము చేసుకొని - నష్టాలొచ్చాయ్ అంటూ చేతులెత్తేశాడట. పాపం.. ఎన్టీఆర్ కూడా నిజమే కాబోసు అనుకొని తన పారితోషికంలో రూ.3 కోట్లు తగ్గించుకొన్నాడట. ఎన్టీఆర్ ఒక్కడే కాదు, మిగిలిన నటీనటులు సాంకేతిక నిపుణుల పారితోషికాలూ సరిగ్గా చెల్లించలేదని టాక్. వాళ్లంతా ఇప్పటికీ రభస గుర్తొస్తే.. పారితోషికాన్ని గుర్తు చేసుకొని పొలోమంటున్నార్ట. కొన్ని సినిమాలంతే.. చేదు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయ్, ఏం చేస్తాం...??