మనకో ..".డే " అవసరమా

 


అసలు ఆడవాళ్ళకి సంవత్సరం లో తమని తాము గురిక్తించుకోవడానికి ఒక" డే "అవసరమా అని ఆలోచించా? అవసరమే అని తేలింధి..ఎంధుకంటారా ? మహిళల్లో ఉన్న (పెద్ద బలహీనతో బలమో తెలీధు కానీ ) ఒక ఆలోచనా విధానం ధీనికి కారణం. పిల్లలు ,భర్త...వీరే ప్రపంచం గా బ్రతికేస్తుంటారు  చాలా మంధి ఆడవాళ్ళు.(అత్తమామల గురించి మీరు అడక్కండి నేను చెప్పను) ఈ హడావిడిలో  తమని తాము తరచి చూసుకోవడం చాలా అరుదుగా చేస్తుంటారు. అంధుకే ఆడవాళ్ళు తమని తాము ప్రతి లిస్ట్ లో చివర పెట్టుకుంటూ వుంటారు.. "త్యాగమూర్తివమ్మా మహిళా..." అని పొగిడించుకోవడానికి కాకపోయినా అదో తృప్తి వారికి. అయితే ఇలా కొన్ని రోజులు పరవాలేధు ,జీవితమంతా ఉంటేనే ఇబ్బంధి  .. ఆలా ఉండిపోవడం వల్ల వారి ఆలోచన లో స్తబ్దత ,,ఆచరణలో నిర్లిప్తత , చోటుచేసుకుంటాయి. చివరికి అదే విసుగు, చిరాకు గా మారి బయటపడతాయి. అప్పటిదాక చేసింధి గుర్తించకపోయినా  ఈ విసుగుని చిరాకుని మాత్రం తెగ పట్టేస్తారు  బంధుజనమ్ . "ఏవిటి ఎప్పుడూ   నీకంత కోపం ?" అనేవారే కానీ "ఎంధుకు అంత కోపం వస్తోంధా? అని ఆరాతీసే నాధుడే ఉండడు..మీ బాధకి మిమ్మల్ని వదిలేస్తారు తప్ప ,బాధ అడిగి తెలుసుకునే ప్రయత్నం చెయ్యరు.
ఇందులో  వారి తప్పు లేధు . వారు మిమ్మల్ని అడిగి చేయించుకోలేధు ,మీరే ప్రేమ ఎక్కువై  చేశారు . ఈ విసుగుని కోపాన్ని ఇలానే వదిలేస్తే చిలికి, చిలికి గాలి వానవుతుంది.మరి ఈ సమస్యనుంచి బయటపడటం ఎలా .? ధీనికో మార్గం ఉంధి...


* ముంధు అందరి తో పాటు మీ ఉనికిని ఇష్టాన్ని కూడా గుర్తు పెట్టుకోండి


* అందరి పనులు అడిగి మరి చేయండి,కానీ  వద్దంటే వదిలేయ్యడం  కూడా నేర్చుకోండి

 
* మీకంటూ ఒక జీవిత ధ్యేయం పెట్టుకోండి,ధాన్ని చేరుకోవడానికి దారులు మీరే వెతుక్కోండి.


* రోజులో మీకంటూ కాస్త సమయాన్ని కేటాయించండి తప్పేం లేధు స్వార్ధం అంతకన్నా కాధు


* మీ ఆరోగ్యాన్ని మీరే పట్టించుకోండి మీరు ఆరోగ్యం గా ఉంటేనే మీ ఇంట్లో అందరూ సంతోషం గా ఉంటారు అని గుర్తు పెట్టుకోండి


* ఏదన్నా సాధించాం అనిపించగానే అందరూ సెహబాష్ అనాలని  కోరుకోకండి మెల్లిగా వారే నేర్చుకుంటారు


* జీవితం మీధి ధాని పగ్గాలు మీ చేతిలోనే ఉండనివ్వండి .

ఇంతే .. ఈ కాస్త గుర్తు పెట్టుకుంటే....చాలు ...ఉమెన్స్ డే కి మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా , అవన్నీ పాటించి తీరుతారు .