అసలు సిసలైన ‘ నాయకి ’

 

" ఆడవారు కే అసలు సిసలు నాయకత్వ లక్షణాలు వున్నాయి . "అందుకే మీ సంస్థల కి అధిపతులు గా ఆడవారిని పెట్టుకోండి ...ఇక ఆ తర్వాత మీ సంస్థ ఎదుగుదల ఎలా వుంటుందో చూడండి అంటున్నారు చెన్నై కి చెందిన ర్యాండ్ స్తాడ్ ఇండియా సంస్థ వారు . ఇప్పటికే ఆడవారి కి సారధ్య అధ్యతలు అపగిస్తే ఆ సంస్థలు విజయపధం లో దూసుకుపోతాయి అని ప్రపంచ వ్యాప్తం గా ఎన్నో అధ్యయనాలు నిరూపించాయి.  అయితే మన భారత దేశం లో మాత్రం ఇంకా ఆడవారికి కీలక బాధ్యతలు అప్పగించటం విషయం లో కొంత అలసత్వం కనిపిస్తోంది . ఈ నేపద్యం లో ర్యాండ్ స్తాడ్ సంస్థ వారు చేసిన అధ్యయనం మహిళలకు ఆనందాన్ని ఇస్తోంది . వీరు వివిధ సంస్థల ను పరిశీలించి , ఎందరితోనో మాట్లాడి , వారి అభిప్రాయలు తీసుకుని , వాటన్నిటిని క్రోడీకరించి ఆ  నిర్ణయానికి వచ్చారు . ఆడవారికి కీలక బాధ్యతలు అప్పగించిన సంస్థలు విజయపదం లో దూసుకెల్లటం వీరి అధ్యయనం లో గమనించారుట. సో.. నీ వల్ల  అవుతుందా ? అన్న ప్రశ్న ఎదురైతే నావల్ల  మాత్రమే అవుతుంది అని గట్టిగా చెప్పాలి .