బట్టల మీద  మరకలు  ఇలా ఈజీగా తొలగించవచ్చు..!

 


మరక మంచిదే అనే యాడ్ చూసే ఉంటారు. అయితే నచ్చిన దుస్తుల మీద మరకలు పడటం వల్ల చాలా బాధపడతాం.  ముఖ్యంగా ఫేవరెట్ డ్రెస్ అని అందరికీ ఉంటుంది.  పొరపాటున ఈ ఫేవరెట్ డ్రెస్ మీద కానీ, ఖరీదైన దుస్తుల మీద కానీ మరకలు పడితే మనసు విలవిలలాడుతుంది. అయితే కొన్ని సులభమైన ఇంటి చిట్కాలతో ఈ మరకలను సులభంగా తొలగించుకోవచ్చు.

నిమ్మరసం..

నిమ్మరసం సహజమైన బ్లీచ్ ఏజెంట్ గా పనిచేస్తంది. దుస్తుల మీద మరకలు ఏర్పడినప్పుడు దాని మీద నిమ్మరసం పిండాలి. ఆ తరువాత కొద్దిసేపు దాన్ని అలాగే వదిలేయాలి.  ఆ తరువాత కడగాలి.  మరకలు మాయం అవుతాయి.

బేకింగ్ సోడా..

బేకింగ్ సోడా కూడా శక్తివంతమైన క్లీనింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. కేవలం దుస్తులే కాదు.. వివిధ వస్తుల మీద మొండి మరకలను కూడా బేకింగ్ సోడా సహాయంతో మాయం చేయవచ్చు.  ఇకపోతే దుస్తుల మీద ఏర్పడిన మరకల మీద బేకింగ్ సోడా పేస్ట్ అప్లై చేయాలి.  ఆ గుడ్డను కాసేపు పక్కన పెట్టాలి. ఆరిపోయాక దాన్ని వాష్ చేయాలి. బేకింగ్ సోడా మరకల తాలూకు మురికి,  జిడ్డు, రంగు మొదలైనవి లాగేస్తుంది.

వెనిగర్..

నిమ్మకాయకు ప్రత్యామ్నాయంగా చాలామంది చాలా సందర్భాలలో వెనిగర్ ను ఉపయోగిస్తారు. అయితే బట్టల మీద మరకలను కూడా వెనిగర్ ద్వారా తొలగించుకోవచ్చు.  మరకల మీద వెనిగర్ రాసి కాసేపు అలాగే ఉంచాలి.  ఆరిన తరువాత  వాష్ చేయాలి.

హైడ్రోజన్ పెరాక్సైడ్..

రంగు దుస్తులపై హైడ్రోజన్ పెరాక్సైడ్ ను ఉపయోగించే ముందు ఏదైనా ప్రాంతంలో ప్యాచ్ టెస్ట్ చేయాలి.   బట్టలకు ఎలాంటి నష్టం కలగకుంటే మరకల మీద ప్రయోగించాలి.  ఇది మరకలు తొలగించడంలో చాలా ప్రబావవంతంగా ఉంటుంది.

డిష్ వాష్ సోప్..

డిష్ వాష్ సోప్ మరకల తాలూకు ఆయిల్,  గ్రీజు మరకలను తొలగించడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది.  మరక మీద కొద్దిగా డిష్ వా,్ సోప్ రాసి రుద్దాలి.  తర్వాత దాన్ని వాష్ చేయాలి.

ఉప్పు..

మరకలు ఇంకా అప్పుడే అయినవి అయితే వాటని తొలగించడానికి ఉప్పు భలే మంచి ఎంపిక.  మరకలపైన ఉప్పును వేయాలి.  ఉప్పు మరకల తాలూకు గ్రీజు, జిడ్డు, రంగును లాగేస్తుంది.

బోరాక్స్..

బోరాక్స్ అనేక రకాల మరకలను తొలగించడంలో సహాయపడుతుంది.  బోరాక్స్ ను పేస్ట్ చేసి మరకల మీద రాసి కాసేపు అలాగే వదిలేయాలి.  ఆ తరువాత వాష్ చేయాలి.  మరకలు మాయమవుతాయి.

బంగాళదుంప..

బంగాళదుంప రసం తుప్పు మరకలను తొలగించడంలో సహాయపడుతుంది.  బట్టల మీద తుప్పు మరకలు ఉన్నప్పుడు బంగాళదుంప ను కట్ చేసి బంగాళదుంప ముక్కలతో మరకల మీద బాగా రుద్దాలి.  ఇలా చేస్తే మరకలు పోతాయి.

                                              *రూపశ్రీ.