మనసును తెలిపే మేకప్
అమ్మాయిలు అందంగా కనిపించాలని మేకప్ చేసుకుంటారు. కాని రెగ్యులర్ గా పూర్తి మేకప్ కాకుండా జస్ట్ ఓ మస్కారా లేదా ఫౌండేషన్ లేదా లిప్ స్టిక్ ఇలా ఒకొకరి చాయిస్ ఒకోలా ఉంటుంది.
ఈ చాయిస్ లోనే వారి వ్యక్తిత్వం తెలిసిపోతుందట. అదెలాగో చూద్దాం.
* పూర్తి మేకప్ సంగతి ఎలా ఉన్నా ఫౌండేషన్ ని రెగ్యులర్ గా వాడే అమ్మాయిలని సలువుగా గుర్తించవచ్చు. వీళ్లు ఏ విషయాన్ని అంత త్వరగా నమ్మరు. జాగ్రత్త ఎక్కువ. అలాగే పట్టుదల కూడా ఎక్కువ. రిస్కు మేనేజ్ మెంట్ వీరికి తెలిసినట్టుగా ఎవరికీ తెలియదు. వీళ్లతో స్నేహం చేస్తే చాలు రిస్క్ లని ఫేస్ చేయడం సులభం అనిపిస్తుంది.
* మస్కారా, ఐషాడో లని ఇష్టంగా ఉపయోగించే వారితో స్నేహం కుదిరితే వదలకండి. వీళ్లు స్నేహానికి ప్రాణం ఇస్తారు. ఫ్రెండ్స్ ప్రాబ్లమ్స్ ని వాళ్ళ ప్రాబ్లమ్స్ గా ఫీల్ అయి సమస్యని పరిష్కరిస్తారు. సంతోషంగా ఉంటారు. అందరిని అర్ధం చేసుకుంటారు. కాని వీరి స్నేహం కావాలంటే అంతే నిజాయితీగా ఉండాని వీరితో.
* రెగ్యులర్ గా లిప్ స్టిక్ వాడేవాళ్లు ఎప్పటికప్పుడు కొత్త స్నేహితులను ఫాలో అయ్యేవారు ముక్కుసూటి మనుషులు అని చెప్పవచ్చు. ఇక నెయిల్ పాలిష్ మాత్రమే వాడే వాళ్లలో లీడర్ షిప్ క్వాలిటీస్ ఎక్కువ. భయం అన్నది వీరికి ఉండదు. ఇక పెర్ఫ్యూమ్ మాత్రమే వాడే వారికి సిక్త్స్ సెన్స్ ఎక్కువ ఉంటుంది. అందరిని అర్ధం చేసుకుంటారు.
ఇవండి మేకప్ వెనుక దాగివున్న మనసు మాటలు. మరి మీరు ఏం వాడతారో చూసి దానిని బట్టి మీ మనసు తెలుసుకోండి.
-రమ