బాదం పాలు పిల్లలకు మంచి పోషకాలనిస్తాయి. బాదం పాలును తీసుకునే పిల్లల్లో మేధాశక్తి పెంపొందడమే గాకుండా కండరాలు పటిష్టమవుతాయి. జుట్టు బాగా పెరుగుతుంది.
ఖర్జూర పండ్లను బాగా కాచిన పాలలో రోజూ కలుపుకుని తీసుకుంటే ఐరన్ శక్తి లభిస్తుంది.
పిల్లలు, గర్భిణీ మహిళలు ఖర్జూరాలను పాలతో కలిపి తీసుకోవడం చాలా అవసరం. ఖర్జూర పండ్లు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. మహిళల్లో నెలసరి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
ఇక ఆఖ్రోట్ పండ్లను తీసుకుంటే రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. గుండెపోటుకు చెక్ పెట్టాలంటే ఆఖ్రోట్ పండ్లను రోజూ రెండేసి తీసుకోవడం మంచిది. ఇందులో ఒమెగా 3 ఫాట్ ఆమ్లాలున్నాయని న్యూట్రీషన్లు అంటున్నారు.
ఐరన్ శక్తినిచ్చే ఎండు ద్రాక్షల్ని తీసుకోవడం ద్వారా రక్తహీనతకు చెక్ పెట్టవచ్చును.
మీ పిల్లలు బరువు పెరగకపోతే.. ఐదు ఎండు ద్రాక్షల్ని రోజూ తినిపిస్తే ఫలితం ఉంటుంది. అజీర్ణానికి కూడా ఎండుద్రాక్ష చెక్ పెడుతుంది.
జీడిపప్పులో విటమిన్ బి, మెగ్నీషియం, పొటాషియం, పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి జీడిపప్పు గుండెను కాపాడుతుంది.