1. మీరు మంచి దృష్టి మరియు రీడింగ్ లో ఎలాంటి సమస్య అయినా కనీసం సంవత్సరంనకు ఒకసారి చెకప్ కు వెళ్ళండి. వివిధ కంటి సంబంధిత రోగాలను గుర్తించడం మరియు సరైన చికిత్స కు చాలా మంచి మార్గంగా ఉంటుంది.

2. నిరంతరం మీ కళ్ళు రెప్పలు మూసి తెరవటం వల్ల మీ కళ్ళను తాజాగా ఉంచటానికి మరియు కంటి అలసట నివారించేందుకు చాలా సులభమైన మార్గంగా ఉంటుంది. సాదారణంగా కంప్యూటర్ యూజర్లు కళ్ళు రెప్పలు మూసి తెరవటం చాలా తక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి వారు తమ కళ్ళును ప్రతి మూడు నాలుగు సెకన్లు ఒకసారి మూసి తెరుస్తూ వ్యాయామం చేయాలి.

3. మేము దగ్గరగా ఉన్నవస్తువుల వద్ద ఎక్కువ సమయం గడిపిన తరువాత దూరపు వస్తువులను చూడటం ఒక అలవాటుగా పాటించాలి. వాకింగ్ లేదా కూర్చొని ఉండగా మీ చుట్టూ దూరంగా ఉన్న వస్తువులను చూడటానికి ప్రయత్నించండి.

4. మీ కారు లేదా మీ కార్యాలయం నుండి ఎయిర్ కండిషన్డ్ గాలి మీ కళ్ళలో తేమ లేకుండా చేస్తుంది. ఎల్లప్పుడూ మీ A/C ప్యానెల్ ను క్రిందికి లేదా మీ ముఖం నుండి దూరంగా ఉండేలా చూసుకోవాలి. ఎయిర్ కండీషనర్ గాలి తీవ్రమైన పొడి,అంధత్వం లేదా ఇతర కంటి రుగ్మతలకు కారణం కావచ్చు.

5. దుమ్ము, దూలి వంటి వాటితో మీ కళ్ళు పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి దుమ్ము, ధూలి, రసాయనాలతో పని చేసేవారు,క్రాకర్లు పగిలిపోవటం వల్ల,ఈత సమయంలోను,ఆటలు ఆడుకొనేటప్పుడు తప్పనిసరిగా రక్షణకు కళ్ళద్దాలు ధరించాలి.

6. మీ కళ్ళు ఒత్తిడిగా ఉన్నాయని భావిస్తే వాష్ రూంకి వెళ్లి పూర్తిగా మీ కళ్ళును కడగాలి. దీనిని రోజువారీ పనిగా అలవాటు చేసుకోండి. నీటితో మీ కళ్ళు కడగటం వల్ల అధిక ఒత్తిడి నుండి మీ కళ్ళు ఉపశమనం పొందటానికి మరియు వాటిని తాజాగా ఉంచటానికి సహాయం చేస్తుంది.

7. పడుకొనే ముందు మీ కంటి మేకప్ ను తొలగించుకోవాలి. రాత్రి మీరు కంటి మేకప్ తీయకపోతే ఇరిటేషన్ రావచ్చు. అంతేకాక ఆ మేకప్ కన్ను లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది.

8. నిద్ర లేకపోవడం వలన మీరు అలసట,తలనొప్పి మరియు మీ చూపు మసకగా ఉండేలా చేస్తుంది. అందువల్ల నిద్ర బాగా ఉంటె మంచి చూపుకు మరియు కంటి కండరాల విశ్రాంతికి సహాయం చేస్తుంది.

9. గుడ్లు తినడం వల్ల గుడ్డులో ఉండే పోషక పదార్థాలు చురుకైన చూపుకు,వయస్సు సంబంధిత కంటి వ్యాధులను తగ్గిస్తున్నది.

10. మీ ఆహారంలో కనీసం వారంలో రెండు సార్లు చేపలు ఉండేలా చూసుకోండి. చేపలలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉండుట వల్ల డ్రై-ఐ సిండ్రోం నివారించేందుకు ఉపయోగపడుతుంది.

11. నీరు మీ అన్ని సమస్యలకు ఉత్తమమైన నివారణ మార్గంగా చెప్పవచ్చు. తరచుగా మసకగా ఉన్న దృష్టి నిర్జలీకరణ వలన కావచ్చు. అందువల్ల క్రమమైన విరామాల్లో నీటిని త్రాగుతూ ఉండాలి.

12. మీ ఆహారంలో పాలకూర ఎక్కువగా ఉండేలా చూసుకోండి. పాలకూర అనేక కంటి సంబంధిత సమస్యలను నిరోధించడానికి సహాయపడుతుంది.