ఖర్జూరంలో ఎన్నో పోషక విలువలు దాగివున్నాయి.
1. వ్యాధినిరోధక శక్తిని పెంచే ఖర్జూరాల్లో ఐరన్, విటమిన్, మినరల్స్ ఉన్నాయి. తద్వారా నరాల బలహీనతకు చెక్ పెట్టవచ్చును.
2. ఖర్జూరంలోని పీచు పదార్థం క్యాన్సర్‌ను మన దరికి చేరనివ్వదు.
3. ఖర్జూరాలు తినడం వలన చేతులు, కాళ్లు, మోకాలి నొప్పులకు చెక్ పెట్టవచ్చు.
4. విటమిన్ A లోపంతో కంటి సమస్యలకు ఖర్జూరాలతో చెక్ పెట్టవచ్చు. ఖర్జూరాన్ని తేనెలో నానబెట్టి తింటే రోగాలన్నింటినీ దూరం చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు ఖర్జూరాలను తీసుకోవచ్చు.
5. మహిళలకు నెలసరి సమయాల్లో ఏర్పడే రక్తస్రావంతో క్యాల్షియం తగ్గిపోతుంది. అందువల్ల వారికి అధికంగా క్యాల్షియం అవసరం.
అందుచేత క్యాల్షియం అధికంగా ఉండే ఖర్జూరాలను తీసుకోవాలని న్యూట్రీషన్లు అంటున్నారు.