రక్తహీనత నుంచి తగ్గించుకోవాలంటే ఇనుము అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. బీన్స్, పచ్చ బఠాణీ, రాజ్‌మా పెసలు, కీరదోస, గుడ్డు, మాంసం వంటి వాటిని ఆహారంలో ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. బాదం, పిస్తా, వాల్‌నట్, వేరుసెనగపప్పులను కూడా అధికంగా తీసుకోవాలి. ఖర్జూరం, ద్రాక్ష, అంజూర్ వంటి ఎండుఫలాలని తీసుకోవడం వల్ల కూడా రక్తహీనత సమస్యను తగ్గించవచ్చు. విటమిన్ సి ఉండే ఆహారాన్ని తినడం వల్ల శరీరం ఆహారం నుంచి ఇనుమును అధికంగా స్వీకరిస్తుంది. భోజనము తర్వాత టీ, కాఫీలు తాగకూడదు. తాగినట్లైతే శరీరానికి సరైన ఇనుము అందదు.