కాళ్ళ నొప్పులు తగ్గాలంటే ఈ క్రింది చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.

గోరు వెచ్చటి నీటిని ధారగా ఎత్తి నొప్పి ఉన్నచోట పోయాలి. కాళ్లను కొబ్బరి నూనెతో, వంట నూనెతో గాని మర్దనా చేయడం వల్ల నొప్పి తగ్గుతుంది.

కాళ్ల కండరాలకు వారానికి రెండు సార్లు కోల్డ్‌ ప్యాక్‌ వేసుకుంటే రిలాక్స్‌ అవుతాయి.

వ్యాయామం, యోగ అలవాటు చేసుకోడం వల్ల శరీరంలో ఒత్తిడి, ఆందోళన తగ్గి కాళ్లు తేలికబడతాయి.

వ్యాయామం చేస్తున్నప్పడు కాళ్లు నొప్పిగా అనిపిస్తే చెయ్యడం ఆపేయండి. అదే పనిగా చేస్తే కండరాలు దెబ్బతినే అవకాశం ఉంది.

వాకింగ్‌ చెయ్యడం, నిద్రపోవడం, లేవడం ప్రతిరోజూ ఒకే సమయంలో చెయ్యాలి.

రోజుకి కనీసం ఏడు గంటలైనా నిద్రపోవాలి.

పొగాకుకు, మద్యానికి దూరంగా ఉండాలి.

తాగే కాఫీ, టీలలో ఎక్కువ డికాషన్‌ ఉండకుండా చూసుకోవాలి.

ఎలా బడితే అలా లేవకూడదు. అలా లేస్తే కండరాల నొప్పులొస్తాయి.

అలసిపోయిన కాళ్లను మందులతో తగ్గించే ప్రయత్నం చెయ్యకుండా కాస్త విశ్రాంతి ఇస్తే త్వరగా ఉపశమనం ఇచ్చేవీలుంది. నొప్పి ఎక్కువగా వస్తుంటే వెంటనే డాక్టరుదగ్గరకు వెళ్లడం మంచిది.