కొంత మందితో మాట్లాడటానికి ఇష్టపడతాం, మరికొంతమందిని చూస్తేనే చిరాకు వస్తుంది. ఎందుకంటే కొందరు నోటి దుర్వాసన సర్వ సాధారణంగా అందరూ ఎదుర్కొనే సమస్య. అసలు నోటి దుర్వాసన ఎందుకు వస్తుంది? మన ఆహారపు అలవాట్లు అందుకు కారణమా, మరింకేదైనా సమస్య కావచ్చా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవిగో...
1. మన నోటిలోని పలు బ్యాక్టీరియా విడుదల చేసే వాయువులు దంతాలు, చిగుళ్లూ, నాలుకపై ఒక పూతగా ఏర్పడి నోటి దుర్వాసనకు కారణం కావచ్చు.
2. సాధారణంగా పళ్ల సందుల్లో ఇరుక్కున్న ఆహార పదార్ధాలు వల్ల నోటి దుర్వాసన సమస్య తలెత్తుతుంది.అలాగే కట్టుడు పళ్లూ ఉంటే వాటిని సరైన రీతిలో శుభ్రపరచకపోయినా ఈ దుర్వాసన సమస్య వస్తుంది. పళ్లూ తోముకుంటె నోటి దుర్వాసన పోతుందనుకుంటే పొరపాటు. పళ్లూ శుభ్రంగా తోముకున్న కేవలం 60శాతం అదీ కూడా దంతాలపై భాగం మాత్రమే శుభ్రపడుతుంది.
3. ఇక పొగ తాగే వారిలో నోటి దుర్వాసన సమస్య అధికంగా ఉంటుంది.
4. తరచూ నోటితో గాలి పీల్చే వారిలో నోటి దుర్వాసన సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాగే వెల్లుల్లి, ఉల్లి వంటి ఘాటైన పదార్ధాలు, కాఫీ సేవనం కూడా నోటినుంచి చెడు వాసనను వచ్చేలా చేస్తాయి.
5. ఏదైనా చిగుళ్ల వ్యాధి లేదా దంత సమస్య వస్తొందన్న సూచనగా నోటినుంచి చెడు వాసన వచ్చే ప్రమాదం ఉంది.
6. సైనసైటిస్, బ్రాంకైటిస్, డయాబెటిస్, కాలేయ, మూత్రపిండ వ్యాధులు లేదా ముక్కు, గొంతు, ఊపిరితిత్తులలో ఇన్‌ఫెక్షన్స్ వంటి ఆరోగ్య సమస్యలు కుడా నోటి నుంచి చెడు వాసనల వచ్చేలా చేయవచ్చు.
7. నోరు పొడిబారడం, వైద్య పరిభాషలో దీనినే క్సీరో స్టోమియా అంటారు. దినివల్ల నోటిలో లాలాజలం సరైనంత అందక అతిగా బ్యాక్టీరియా చేరి నోటి దుర్వాసనకు కారణం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీ స్ర్తీలు, మెనోపాజ్ దశలో ఉన్న స్ర్తీలలోనూ, పలు మందులు వాడే వారికీ ఈ క్సీరోస్టోమియా సమస్య వచ్చే అవకాశం ఉంది.