అందమైన గోళ్లు కావాలా ఇదిగో అయిదు టిప్స్ పాటిస్తే చాలు!


 

అందమైన గోళ్లు ఎంతోమంది అమ్మయిలకు ఇష్టం. గోళ్లు అందంగా, ఆరోగ్యంగా, పొడవుగా మెరుస్తూ ఉంటే ఎంతో బాగుంటుంది. అందంగా నెయిల్ పాలిష్ వేసుకుని అట్రాక్షన్ గా కనిపించడం కొందరికి ఇష్టమైతే సాధారణంగా గులాబీరంగులో ఉన్న గోళ్లను చూసి మురిసిపోవడం మరికొందరికి ఇష్టం. మొత్తానికి గోళ్ల వల్ల ఏదైనా సమస్య ఉంటే అబ్బాయిలు బెంగ పడిపోతారు. 

 గోళ్లకు ప్రత్యేక శ్రద్ధ అవసరం, ఎందుకంటే రోజులో  వేడి, తేమ గోళ్లకు తగులుతూ ఉంటాయి. వీటి కారణంగా అవి పొడిగా, పెళుసుగా  మారి తొందరగా విరిగిపోయే అవకాశం ఉంటుంది. బలమైన, ఆరోగ్యకరమైన గోళ్ల రహస్యం ఏమిటా ని చాలా మంది నెట్టింట్లో వెతికేస్తూ ఉంటారు. బలమైన, ఆరోగ్యకరమైన, మెరిసే గోళ్లు కావాలంటే దోసకాయలు, పుచ్చకాయలు, స్ట్రాబెర్రీలు వంటి హైడ్రేటింగ్ ఆహారాలలో నీరు బాగా ఉంటుంది. అలాగే వీటితో పాటు శరీరానికి సరిపడినంత నీరు తీసుకోవాలి.  గోర్లు మరియు క్యూటికల్స్‌ను ఆరోగ్యంగా  ఉంచడానికి వాటికి మాయిశ్చరైజింగ్ హ్యాండ్ లోషన్ లేదా నెయిల్ ఆయిల్‌ను అప్లై చేయవచ్చు.

గోరు సంరక్షణకు ముఖ్యమైన చిట్కాలు:

చేతి తొడుగులు ధరించాలి..

కఠినమైన రసాయనాలు, దుమ్ము, ధూళి చేతులకు తగిలే పరిస్థితులు ఉన్నప్పుడు గోళ్లను రక్షించడానికి గ్లౌజులు ధరించాలి. సింకులో పాత్రలు కడగడం, టాయిలెట్ క్లినింగ్, రసాయనాలు ముట్టుకోవడం వంటి సందర్భాల్లో గ్లౌజులు బెస్ట్ ఆప్షన్. ఇదంతా విదేశాల్లో చేస్తారు మనకెందుకు అనుకుని తీసిపారేయాల్సిన అవసరం లేదు. మంచి చేకూర్చే అలవాటు ఏదైనా పాటించడంలో తప్పులేదు.

విటమిన్ డి..

విటమిన్ డి ఆరోగ్యకరమైన గోళ్లను అందిస్తుంది. సూర్యరశ్మి ద్వారా ఇది మనకు లభిస్తుంది. అయితే ఎక్కువ ఎండకు గోర్లు గురైనప్పుడు గోళ్లు పెళుసుబారతాయి.  మీ గోర్లు ఎండిపోవచ్చు, రంగు మారవచ్చు లేదా ఎక్కువ సూర్యరశ్మితో పగుళ్లు రావచ్చు. బయట ఎక్కువ సమయం గడుపుతున్నప్పుడు, మీ చేతులు మరియు గోళ్లకు సన్‌స్క్రీన్‌ అప్లై చేయాలి.

ఎక్స్‌ఫోలియేట్ చేయడం మర్చిపోకండి..

చర్మాన్ని  ఎక్స్‌ఫోలియేట్ చేయడం వల్ల గోళ్లు, క్యూటికల్స్ కూడా ప్రయోజనం పొందుతాయి. చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి, గోళ్లకు రక్త ప్రసరణను ప్రోత్సహించడానికి, మృదువైన నెయిల్ బ్రష్ లేదా బాడీ స్క్రబ్ ఉపయోగించాలి.  అదనంగా, ఇది మీ క్యూటికల్స్ ఆరోగ్యంగా కనిపించేలా, పెరుగుదల లేకుండా ఆగిపోయిన గొళ్లను మళ్ళీ పెరిగేలా చేస్తుంది.

 గోళ్లను ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి.. 

పొడవాటి గోళ్లు అందంగా అనిపించవచ్చు, కానీ గాఢత కారణంగా అవి విరిగిపోయి, గీసుకోవడం కోసుకోవడం జరిగి హాని కలిగించే అవకాశం ఉంది. అందుకే గోళ్లను ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి.  దీనివల్ల గోళ్ల పరిశుభ్రతను కొనసాగించడం సులభం అవుతుంది.

 నెయిల్ పాలిష్ నుండి విరామం తీసుకోవాలి..

నెయిల్ పాలిష్ వేసుకోవడం  చాలామందికి ఇష్టం. అయినప్పటికీ అప్పుడప్పుడు ఈ నెయిల్ పాలిష్ నుండి  గోళ్లకు విరామం ఇవ్వడం చాలా ముఖ్యం.  అన్ని సమయాల్లో నెయిల్ పాలిష్ ధరిస్తే గోళ్లు బలహీనంగా, పెళుసుగా మారవచ్చు. కేవలం అప్పుడప్పుడు మాత్రమే గోళ్లకు నెయిల్ పాలిష్ వేస్తుండాలి.

                                   ◆నిశ్శబ్ద.