మొటిమల నివారణకు పాటించవలసిన కొన్ని పద్దతులు
మొటిమలు ఉన్నప్పుడు ముఖం శుభ్రం చేసుకొనే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖాన్ని శుభ్రం చేయటానికి సబ్బులు కన్నా నీటిని ఎక్కువగా ఉపయోగించటం మంచిది. రోజు మొత్తంలో వీలైనన్ని ఎక్కువ సార్లు జిడ్డు పోయే విధంగా ముఖాన్ని కడగాలి. గాడమైన రసాయనాలు ఉపయోగించి తయారుచేసిన సబ్బులు,ఫేస్ వాష్ లును అసలు ఉపయోగించకూడదు.
* నూనె రహిత మేకప్ సామాను మాత్రమే ఉపయోగించాలి. అలాగే మొటిమలు ఉన్నవారు నేరుగా ఎండలోకి వెళ్ళకూడదు. ఎండలోకి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా గొడుగు వెంట తీసుకువెళ్ళాలి.
* ఒక స్పూన్ టమోటా గుజ్జులో ఒక స్పూన్ పాలు,రెండు స్పూన్ల నిమ్మరసం కలిపి ముఖానికి బాగా పట్టించి ఆరాక శుభ్రం చేసుకోవాలి.
* రాత్రి పడుకొనే ముందు మొటిమల మీద టూట్ పేస్ట్ అప్లై చేసి,తెల్లవారి లేచిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా మొటిమలు తగ్గే వరకు చేయాలి.
* మెంతి ఆకులను మెత్తగా రుబ్బి మొటిమల మీద ఆపాలి చేసి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.