బంగారు కాంతులతో మెరవండి
దీపావళిలో ఇంటిని మాత్రమే మెరిపిస్తారా ? మీరు బంగారు కాంతులతో మెరవండి పండగోస్తుందంటే అన్నిటికి టైం కేటాయించడం కష్టంగా ఉంటుంది. పార్లల్ కి వెళ్ళే టైం కూడా దొరకపోవచ్చు. కాని ఫేషియల్ ఎలా చేసుకోవాలో నేర్చుకుంటే ఇంట్లో మీసొంతగా మీరే ఈ గోల్డ్ ఫేషియల్ చేసుకోవచ్చు. గోల్డ్ ఫేషియల్ ఎలా చేసుకోవాలి ఈ క్రింది ఇచ్చిన స్టెప్స్ తో చేసుకుని మీరు కూడా బంగారంలా మెరవండి
క్లెన్స్: ముందుగా ముఖానికి గోల్డ్ క్లెన్సర్‌ను రాసి, మృదువుగా మసాజ్ చేసి, వెచ్చని నీటితో కడిగి, కాటన్ టవల్‌తో తుడుచుకోవాలి.
స్క్రబ్: మృతకణాలను తొలగించడానికి గోల్డ్ స్క్రబ్ సహాయపడుతుంది.
క్రీమ్: గోల్డ్ క్రీమ్‌ను ముఖానికి, మెడకు రాసి కింద నుంచి పైకి వేళ్లతో స్ట్రోక్స్ ఇస్తూ ఉండాలి. ఈ క్రీమ్.. గోల్డ్ ఫాయిల్, గోల్డ్ పౌడర్, గోధుమ నూనె, కుంకుమపువ్వు, అలొవెరా జెల్, చందనం కలిగి ఉంటుంది. చర్మానికి బాగా ఇంకేలా వేళ్లతో రాసి, తడి క్లాత్‌తో తుడవాలి.
మాస్క్: కిట్‌లోని గోల్డ్ మాస్క్ క్రీమ్ తీసుకొని ముఖానికి, మెడకు రాయాలి. ఇందులో పసుపు, గోల్డ్ ఫాయిల్, అలొవెరా జెల్ ఉంటాయి. ఈ మాస్క్ బాగా ఆరిన తర్వాత చల్లని నీటిని చిలకరించి, శుభ్రపరచాలి.
మాయిశ్చరైజర్: విడిగా నాణ్యమైన మాయిశ్చరైజర్‌ను వేళ్లతో కొద్దిగా తీసుకొని, ముఖానికి, మెడకు రాసి వలయాకారంగా కదలికలు ఇవ్వాలి.