అధికశాతం మంది ఫాలో అయ్యే ఈ బ్యూటీ టిప్స్ తో చాలా డేంజర్..!
అందంగా కనిపించాలని అందరూ అనుకుంటారు. ముఖ్యంగా అమ్మాయిలకు అందంగా కనిపించడం ఇష్టం. అబ్బాయిలు కూడా తామేమీ తీసిపోవట్లేదని నిరూపిస్తూ ఫేష్ వాష్ లు, బ్యూటీ ట్రీట్మెంట్లు తీసుకుంటారు. చాలామంది అమ్మాయిలు సూర్యకిరణాల వల్ల నలుపెక్కిన చర్మాన్ని తిరిగి తెల్లగా మార్చుకోవడం కోసం ఎన్నో బ్యూటీ ఉత్పత్తులు ఉపయోగిస్తారు. మరికొందరు వాణిజ్య ఉత్పత్తులలో ఉన్న రసాయనాలకు భయపడి ఇంటి చిట్కాలు ఫాలో అవుతారు. ఇవి మాత్రమే కాకుండా మొటిమలు, మచ్చలు, కాంతి వంతమైన చర్మం, కళ్ల కింద నల్లటి వలయాలు, ముడుతలు తగ్గించడం ఇలా చాలా వాటికి ఇంటి చిట్కాలు ఫాలో అవుతారు. అయితే చాలా మంచివి అనుకుంటూ అమ్మాయిలు ఇంట్లో వాడే కొన్నిహోం రెమిడీస్ చర్మాన్ని దారుణంగా దెబ్బతీస్తాయట. అవేంటో తెలుసుకుంటే..
శనగపిండి..
భారతదేశంలో ఎక్కువ మంది అమ్మాయిలు ఉపయోగించే సౌందర్య సాధనం శనగపిండి. వంటిట్లో ఉండే ఈ పిండిని ఫేస్ ప్యాక్ గా వేయడం నుండి ఫేష్ వాష్ గా కూడా వాడుతుంటారు. చిన్న పిల్లలకు శనగపిండి స్నానపు పదార్థంగా ఉపయోగిస్తారు. అయితే శనగపిండి చర్మాన్ని చికాకు పరిచే అవకాశం ఉంటుంది. ట్యాన్ తొలగించడానికి బదులు చర్మం మీద ర్యాషెస్, దద్దుర్లు రావడానికి దారితీస్తుంది.
వాల్నట్ స్క్రబ్..
చాలామంది అమ్మాయిలు ముఖం మీద మృతకణాలు, మచ్చలు, చర్మం గుంటలు పోవడానికి వాల్నట్ స్క్రబ్ ఉపయోగిస్తారు. అయితే ఇది మఖ చర్మాన్ని పాడుచేస్తుంది. ముఖ చర్మం సున్నితంగా అయ్యేలా చేస్తుంది. మరీ ముఖ్యంగా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి వాల్నట్ స్క్రబ్ అస్సలు మంచిది కాదు. వాల్నట్ స్క్రబ్ కు బదులుగా పెరుగు ఉపయోగించవచ్చు. డెడ్ స్కిన్ ను తొలగించడంలో ఇది సహాయపడుతుంది.
నిమ్మరసం..
ముఖ చర్మం కాంతివంతంగా మారడం కోసం చాలామంది నిమ్మరసాన్ని ఉపయోగిస్తారు. ఇది మాత్రమే కాకుండా ఇతర సిట్రస్ పండ్లు కూడా ఉపయోగిస్తుంటారు. అయితే నిమ్మరసం చర్మాన్ని కాంతివంతంగా అయితే చేస్తుంది కానీ చర్మాన్ని సున్నితంగా మార్చేస్తుంది. సూర్యకిరణాల ధాటికి చర్మం తొందరగా నల్లబడటం, చర్మ సమస్యలకు తొందరగా గురికావడం జరుగుతుంది. కాంతివంతమైన చర్మం కావాలని అనుకుంటే విటమిన్-సి సీరమ్ వాడాలి.
ఆపిల్ వెనిగర్..
ఆపిల్ వెనిగర్ ను చర్మ సంరక్షణలో కూడా ఉపయోగిస్తారు. కానీ ఇది ఘాడత ఎక్కువ ఉన్న కారణంగా తొందరగా చర్మాన్ని సున్నితంగా మార్చేస్తుంది. దీని బదులు లాక్టిక్ యాసిడ్ సీరమ్ అప్లై చేస్తే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
*నిశ్శబ్ద.