1. తులసి ఆకుల్ని ఎండబెట్టి పొడిచేసి దాంతో పళ్లు తోముకున్నా దంతాలు ఆరోగ్యంగా మెరుస్తాయి. చిగుళ్ల నుంచి రక్తం కారేవారికి కూడా ఇది మంచి మందు.
2. జామ, యాపిల్, క్యారెట్, చెరకు, దోస… ఇవన్నీ కూడా సహజ వైట్‌నర్లు. వీటిని తరచుగా తింటుంటే వాటిలో ఉండే రసాయనాలు పంటిపై ఉండే మరకల్ని తొలగిస్తాయి.
3. వేప, నల్ల తుమ్మ పుల్లలతో తోముకున్నా కూడా దంతాల మీది మరకలు త్వరగా పోతాయి. వేపలో ఉండే యాస్ట్రింజెంట్లు, యాంటీ సెప్టిక్ గుణాలు పంటికి రక్షణ కల్పించి, దుర్వాసనను పోగొడతాయి.
4. టమాట, ఉసిరి, స్ట్రాబెర్రీ... వీటితో పళ్లపై రుద్దినా అదే ఫలితం లభిస్తుంది. రాత్రిపూట పడుకోబోయే ముందు నారింజ తొక్కతో పళ్లు రుద్దుకుంటే అందులోని సి విటమిన్ రాత్రంతా సూక్ష్మజీవులతో పోరాడుతుంది.
5. అర చెంచాడు బేకింగ్ సోడాలో రెండుచుక్కల హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి కలిపి, ఆ మిశ్రమంతో వారానికి రెండుసార్లు తోముకుంటే క్రమంగా పళ్లు తెల్లగా అవుతాయి.
6. అర టేబుల్‌స్పూన్ బేకింగ్ సోడాలో అంతే పరిమాణంలో వినెగర్, చిటికెడు ఉప్పు కలిపి తోముకుంటే పళ్ల పచ్చదనం పోయి తెల్లగా అవుతాయి. అక్కడ బ్యాక్టీరియా కూడా నిల్వ ఉండలేదు.