మీనాతో విక్టరీ సిద్ధం
on Feb 17, 2014
వెంకటేష్, మీనా కాంబినేషన్లో "చంటి", "సూర్యవంశం", "సుందరకాండ", "అబ్బాయిగారు" వంటి చిత్రాలు వచ్చాయి. అవన్నీ కూడా మంచి ఘనవిజయాన్ని సాధించాయి. అయితే తాజాగా మరోసారి వీరిద్దరూ కలిసి నటించబోతున్నారని తెలిసింది. మలయాళంలో మోహన్ లాల్, మీనా జంటగా నటించిన "దృశ్యం" చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారు. ఇందులో మోహన్ లాల్ పాత్రలో వెంకటేష్ నటించనున్నారు. వెంకీ సరసన మీనాని హీరోయిన్గా తీసుకున్నట్లు సమాచారం. మలయాళంలోనూ ఈ చిత్రానికి హీరోయిన్ మీనాయే. ఇందులో నదియా పోలీసు ఆఫీసర్గా కనిపించబోతోంది. శ్రీప్రియ దర్శకత్వం వహించబోతుంది. ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.