పోటీలో ఉన్న ఆటో, లైలా...!
on Feb 18, 2014
నాగచైతన్య హీరోగా నటిస్తున్న "ఆటోనగర్ సూర్య" చిత్రం గతకొంత కాలంగా విడుదల కాకుండా వాయిదా పడుతూ వస్తున్న విషయం అందరికి తెలిసిందే. దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటించింది. అనూప్ అందించిన ఈ చిత్రంలోని పాటలు ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. కె.అచ్చిరెడ్డి నిర్మించిన ఈ సినిమాను ఇదే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే... చైతన్య, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న "ఒక లైలా కోసం" చిత్రం కూడా విడుదలకు సిద్ధం అవుతుంది. విజయ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. మార్చి చివర్లో లేదా ఏప్రిల్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఆటో కంటే ముందుగా లైలా అంటూ చైతన్య వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు.