వచ్చేనెలలో లడ్డుబాబు వస్తున్నాడు
on Feb 17, 2014
బక్కగా ఉన్న నరేష్ తో కలిసి "అల్లరి" చిత్రాన్ని తెరకెక్కించిన రవిబాబు... ఇపుడు ఆ బక్కబాబుని లడ్డుబాబుగా మార్చి సినిమా తీస్తున్నాడు. రవిబాబు దర్శకత్వంలో నరేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "లడ్డుబాబు" మార్చి నెలలో విడుదల కానుంది. ఇందులో భూమిక, పూర్ణ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్, ఫోటోలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో త్వరలోనే తెలియనుంది.