విక్రమ్ నువ్వు నిజంగానే తోపువయ్యా!
on Aug 2, 2016
ఎంతటి గొప్ప నటుడైనా తన నాటజీవితంలో మహా అయితే ఒక మూడు లేదా అయిదు విభిన్న చిత్రాల్లో నటించేసి "అబ్బో చాలా చేసేశామ్" అనుకొంటుంటాడు. కానీ.. నటనకు పర్యాయపదం లాంటి విక్రమ్ మాత్రం తన కెరీర్ లో ఎక్కువశాతం ప్రయోగాత్మక చిత్రాల్లో, ప్రయోగాత్మక పాత్రల్లో నటించడానికే మొగ్గు చూపాడు. అందుకే విక్రమ్ సినిమాలు ఫ్లాపాయినా అతడి నటన కోసమే ప్రేక్షకులు ఆ సినిమాను ఒకటికి రెండుసార్లు చూస్తుంటారు.
తాజాగా విక్రమ్ నటించిన చిత్రం "ఇరుముగన్" (తెలుగులో "ఇంకొక్కడు") ఆడియో నేడు విడుదలైంది. ఈ సందర్భంగా విడుదల చేసిన ట్రైలర్ భాషా బేధం లేకుండా అందర్నీ అమితంగా అలరిస్తూ ఆశ్చర్యపరుస్తుంది. ఈ సినిమాలో విక్రమ్ ద్విపాత్రాభినయం చేస్తుండగా.. అందులో ఒకటి ట్రాన్స్ జెండర్ రోల్. ట్రాన్స్ జెండర్ అనగానే మహా అయితే అమ్మాయిలా బిహేవ్ చేస్తాడనో లేక వేషధారణ అలా మెయింటైన్ చేస్తాడేమో అనుకొన్నారు జనాలు. అయితే.. ఎప్పట్లానే విక్రమ్ ఈసారి కూడా విశేషంగా అలరించాడు. వేషధారణ మొదలుకొని హావభావాల ప్రకటన, బాడీ లాంగ్వేజ్ ఇలా అన్నిట్లోనూ నిజంగానే ట్రాన్స్ జెండర్ ఏమో అనిపించేలా నటించాడు, కాదు కాదు జీవించాడు. సూపర్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయనతార, నిత్యమీనెన్ లు కథానాయికలుగా నటించగా.. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించారు!