"ఐ" వెనుక విక్రమ్ కన్నీటి గాధ
on Sep 6, 2016
ప్రస్తుత భారతీయ చిత్ర పరిశ్రమలో విలక్షణత కోసం ఎంతకైనా తెగించే నటుల్లో ఒకరు లోకనాయకుడు కమల్ హాసన్ కాగా, మరోకరు చియాన్ విక్రమ్..ఆశ్చర్యకరంగా వీరిద్దరూ తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన వారే కావడం విశేషం. అయితే ఒక పాత్ర కోసం కష్టపడే విషయంలో కమల్ కంటే ఒక అడుగు ముందే ఉంటాడు విక్రమ్. "సేతు" నుంచి..గత ఏడాది వచ్చిన "ఐ "వరకు ఆయా పాత్రల కోసం మామూలు కష్టపడలేదు చియాన్.
అయితే వీటన్నింటిలోనూ "ఐ" సినిమాకి పడిన కష్టం అంతా ఇంతా కాదంటూ ఒక ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. బాడీ బిల్డర్ కావాలంటే నెలలు కాదు సంవత్సరాలు పడుతుంది. ఎంతో సాధన ఉంటే తప్ప కండలు తిరిగిన దేహం సొంతం కాదు. కానీ నేను మూడు నెలల్లోనే అది సాధించాను. రేయింబవళ్లు జిమ్‌లోనే గడిపాను..దాని కోసం ఎలాంటి స్టెరాయిడ్స్ వాడలేదు. కేవలం కష్టాన్నే నమ్ముకున్నానంతే. అయితే ఈ సినిమాలో మోడల్ పాత్ర కూడా ఉండటంతో పెంచుకున్న బాడీని కరిగించుకోవాల్సి వచ్చింది. బాడీ బిల్డర్ పాత్ర కంటే మోడల్ పాత్ర కోసం మరింత కష్టపడాల్సి వచ్చింది. దాని కోసం కడుపు మాడ్చుకున్నాను..ఫ్యాట్ బర్నర్ లాంటివేమి వాడలేదు. నా కష్టం చూడలేక శంకర్ సారే చాలాసార్లు ఇంత కష్టం అవసరమా అన్నారు. అయినా నా తృప్తి కోసం అని చేశాను అని చెప్పారు.