ఏకంగా 25 గెటప్పుల్లో చియాన్ విక్రమ్!!
on Aug 2, 2019
ఏకంగా 25 గెటప్పుల్లో చియాన్ విక్రమ్!!
విలక్షమైన క్యారెక్టర్స్ చేయడంలో చియాన్ విక్రమ్ ఎప్పుడూ ముందుగా ఉంటారు. ఆయన నటించిన చాలా సినిమాలు అందుకు నిదర్శనంగా ఉంటాయి. ఇక ప్రయోగాలు చేయడానికి ఇష్టపడతాను అని చెప్పే విక్రమ్ మరో ప్రయోగం చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఒకసారి వివరాల్లోకి వెళితే...ఈ సారి ఏకండా 25 గెటప్పులు చేయడానికి రెడీ అయ్యాడు. అవును అజయ్ ముత్తు డైరక్షన్ విక్రమ్ 25 విభిన్నమైన పాత్రలు చేయనున్నాడట. ఆయన మేకోవర్ కి సంబంధించిన డిజైన్స్ హాలీవుడ్ కి చెందిన టెక్నీషియన్స్ సిద్దం చేస్తున్నారట. త్వరలో టెస్ట్ షూట్ చేయడానికి విక్రమ్ అమెరికా వెళ్లనున్నారట. ఈ సినిమా ఈ నెలాఖరులో సెట్స్ మీదకు వెళ్లనుందట. నెక్ట్స్ ఇయర్ మిడిల్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. 25 పాత్రల్లో నటించే మాటే నిజమైతే విక్రమ్ ఈ రికార్డ్ సాధించిన మొదటి హీరోగా నిలుస్తాడనడంలో సందేహం లేదు.