ఎన్.కె.ఆర్.ఫిలింస్ ద్వారా తెలుగులో "ఇరుముగన్"
on Jul 28, 2016
శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ వంటి విలక్షణమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని ఏర్పరుచుకున్న హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న మరో ఎక్స్ పెరిమెంటల్ యాక్షన్ థ్రిల్లర్ `ఇంకొక్కడు`. నయనతార, నిత్యామీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న చిత్రం `ఇరుముగన్`. ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్.కె.ఆర్.ఫిలింస్ బ్యానర్ పై ఆ సంస్థ అధినేత నీలం కృష్ణారెడ్డి `ఇంకొక్కడు` అనే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు.
విజయ్ తో పులి వంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిచింన నిర్మాత శిబుథమీన్స్, విక్రమ్ ప్రభుతో అరిమనంబి వంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ఆనంద్ శంకర్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్, హై టెక్నికల్ స్టాండర్డ్స్ తో `ఇంకొక్కడు` చిత్రం రూపొందుతోంది. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి విడుదలచేసిన టీజర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాత నీలం కృష్ణారెడ్డి ఫ్యాన్సీ ఆఫర్ తో తెలుగు హక్కులను సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా....
నీలం కృష్ణారెడ్డి మాట్లాడుతూ ``తెలుగు ప్రేక్షకులకు క్వాలిటీతో కూడుకున్న చిత్రాలను అందించడమే మా బ్యానర్ లక్ష్యం. శిబుథమీన్స్ గారు, ఆనంద్ శంకర్ గారు కాంబినేషన్ లో భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్, విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ చిత్రం రూపొందుతోంది. విక్రమ్, నయనతార, నిత్యామీనన్ వంటి టాప్ స్టార్స్ తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ గా హరీష్ జైరాజ్, సినిమాటోగ్రాఫర్ గా ఆర్.రాజశేఖర్, ఎడిటర్ గా భువన్ శ్రీనివాస్ వంటి టాప్ టెక్నిషియన్స్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. తమిళంలో ఆగస్టు 2న చెన్నైలో ఆడియో విడుదల కానుంది. త్వరలోనే తెలుగులో ఆడియో, సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం‘‘ అన్నారు.