గోపీచంద్ ద్విపాత్రాభినయం!
on Jul 9, 2016
"సౌఖ్యం" లాంటి డిజాస్టర్ తర్వాత గోపీచంద్ తన తదుపరి చిత్రాల ఎంపిక చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నాడు. కథలో వైవిధ్యం, క్యారెక్టరైజేషన్ లో కొత్తదనం లేకపోతే ఎంత పెద్ద డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎప్రోచ్ అయినా పట్టించుకోవడం లేదట. తాజాగా సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు అంగీకరించిన గోపీచంద్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం పోషించనున్నాడని తెలుస్తోంది. ఇప్పటివరకూ గోపీచంద్ ద్విపాత్రాభినయం చేయలేదు.
మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో గోపీచంద్ ఓ మాస్ కుర్రాడిగా, అమెరికాలో పుట్టిపెరిగిన ఎన్నారై గా రెండు విభిన్నపాత్రలు పోషిస్తున్నాడని వినికిడి. ఇప్పటికే ఒక హీరోయిన్ గా కేతరీన్ ను ఎంపిక చేయగా.. ఇంకో హీరోయిన్ కోసం ఎంపిక సాగుతోంది. గోపీచంద్ నటించిన "ఆక్సిజన్" సెప్టెంబర్ లో విడుదలకు సిద్ధమవుతుంది!