చాణక్య ట్రైలర్: కమర్షియల్ మిక్చర్ ‘రా’
on Sep 26, 2019
‘రా’ ఏజెంట్ అర్జున్ శ్రీకర్‌గా గోపీచంద్ నటిస్తున్న సినిమా ‘చాణక్య’. గురువారం ట్రైలర్ విడుదల చేశారు. సాధారణంగా రా ఏజెంట్లు తన ఐడెంటినీ దాచి, ఏదో ఒక ఉద్యోగం చేస్తూ, తమకు కావలసిన ఇన్‌ఫర్మేషన్ రాబట్టుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. అవసరం వచ్చినప్పుడు ఐడెంటిటీ బయట పెట్టి యుద్ధంలోకి దిగుతారు. ‘చాణక్య’ ట్రైలర్ చూస్తే అలాగే ఉంది. తీవ్రవాదులపై ‘రా’ పోరాటం, పాకిస్తాన్‌లో తల దాచుకున్న దావూద్ ఇబ్రహీం వంటి వ్యక్తిని విలన్‌గా చూపించడం వంటి రొటీన్ వ్యవహారాలే ఉన్నాయి. కానీ, కమర్షియల్ మిక్చర్ బాగా కుదిరింది. సినిమాలో కామెడీకి స్కోప్ ఉందని, లవ్ ట్రాక్ ఉందని ట్రైలర్‌తో చెప్పారు. కానీ, హీరోయిన్ మెహరీన్ మరీ మైదా ముద్దలా, ఎక్స్‌ప్రెషన్స్ లేకుండా కనిపించింది. ఎప్పటిలా నటించే ప్రయత్నం చేయలేదు. చాలా రోజుల తర్వాత సునీల్, రఘుబాబుకు మంచి పాత్రలు దొరికినట్టున్నాయి. ట్రైలర్ వరకూ క్లిక్ అయ్యారు. సినిమాలో ఎలా చేశారో? ఈ సినిమాతో గోపీచంద్ హిట్ కొట్టేట్టు ఉన్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
