గోపీచంద్ యాక్సిడెంట్ దెబ్బకి బిజినెస్ జరిగిందా ?
on Jun 11, 2019
ఈ మధ్య కాలంలో గోపీచంద్ టైం అసలు కలిసి రావడం లేదు. తొలివలపు లాంటి లవ్ స్టోరీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన గోపీ ఆ తర్వాత మూడు సినిమాలకి నెగటివ్ రోల్స్ చేసాక మళ్ళీ హీరో అయి ఆడియెన్స్ ని మెప్పించాడు. నిజానికి ఆయన హీరోగా కంటే విలన్ గానే బాగుంటాడని కూడా విశ్లేషకులు చెబుతూ ఉంటారు. అయితే ఆ విషయాన్నీ పక్కన పెడితే 2006 నుండి ఈయన ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. ఒక్కో ఏడాది మిస్ చేసాడు అది వేరే విషయం. అయితే చివరిగా 2014లో హిట్ అందుకున్న ఈయన ఆ తర్వాత హిట్ కోసం చేయని ప్రయత్నం లేదు, దాదాపు అరడజను సినిమాలు రిలీజ్ చేసినా ఏ ఒక్క సినిమా కూడా అనుకున్న మేర ఆడలేదు. ఇక సినిమాలు లేక సైలంట్ గా ఉన్న సమయంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకరతో ఒక సినిమా మొదలు పెట్టాడు.
తమిళ్ డైరెక్టర్ తీరు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇండియన్ ఆర్మీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి చాణక్య అనే టైటిల్ ఫిక్స్ చేసారు. నిజానికి ఈ సినిమా గత నెలలో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసారు, అయితే షూట్ మధ్యలో ఉండగా గోపీచంద్ కి యాక్సిడెంట్ కావడంతో మొత్తం ప్లాన్ అప్సెట్ అయ్యింది. ఆయనకీ సివియర్ సర్జరీ జరగడంతో దెబ్బకి గోపీచంద్ తో పాటు మిగతా ఆర్టిస్ట్స్ డేట్స్ కూడా వెస్ట్ అయ్యాయి. ఈ దెబ్బకి తక్కువలో అవకొడదామనుకున్న బడ్జెట్ ఇప్పుడు నలభై కోట్లను దాటుతుందట. నిజానికి ప్రస్తుతం గోపీ మార్కెట్ పాతిక కోట్ల దగ్గర్లో ఉంది, కానీ యాక్సిడెంట్ దెబ్బకి సినిమా నిర్మాణ ఖర్చే పదిహేను కోట్ల మేర ఎగబాకడంతో ఈ సినిమాని ముందే మార్కెటింగ్ చేసే పనిలో పడ్డ అనిల్ సుంకర ప్రీ రిలీజ్ బిజినెస్ గట్టిగ చేశారని అంటున్నారు.
బయటకు రానీయడం లేదు కానీ ఈ సినిమాని మరో పదిహేను కోట్ల లాభం వచ్చేలా యాభైఐదు కోట్ల ప్రీ బిజినెస్ చేసారని అంటున్నారు. ఇది గోపీకి చాలా కలిసొచ్చే అంశం. ఈ సినిమా గనుక యావరేజ్ టాక్ తెచ్చుకున్నా థ్రిల్లర్ కాబట్టి జరిగిన బిజినెస్ సాధించే అవకాశం ఉంది, ఇక హిట్ టాక్ తెచ్చుకుంటే ఇంకా చెప్పేదేముంది, మళ్ళీ గోపీ ఫామ్ లోకి వచ్చేసినట్టే అన్నమాట.