'గౌతమ్ నందా' కాంబినేషన్ మరోసారి...
on Sep 19, 2019
హీరో గోపీచంద్, డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌లో ఇదివరకు 'గౌతమ్ నందా' సినిమా వచ్చింది. గౌతమ్, నందా అనే రెండు భిన్న పాత్రల్లో గోపి నటనకు ప్రశంసలు లభించాయి. వాటిలో ఒకటి నెగటివ్ కేరెక్టర్ కావడం గమనార్హం. అయితే బాక్సాఫీస్ వద్ద ఆ మూవీ ఆశించిన రీతిలో ఆడలేదు. అయితే గోపి, సంపత్ మరోసారి కలిసి పనిచేయడానికి అదేమీ అడ్డు కాలేదు. అవును. గోపీచంద్, సంపత్ నంది కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోంది.
ఈ మూవీని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బేనర్‌పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మించనున్నారు. ఇంతకుముందు ఆయన సమంత ప్రధాన పాత్ర పోషించిన 'యు టర్న్' మూవీని నిర్మించారు. గోపి, సంపత్ కాంబినేషన్ మూవీని హై బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో నిర్మించనున్నట్లు ఆయన చెప్పారు. ఈ సినిమా ఎప్పుడు మొదలయ్యేది, హీరోయిన్ ఎవరు, ఇతర కీలక పాత్రధారులు, టెక్నీషియన్స్ వివరాలను త్వరలో తెలియజేస్తామన్నారు. ఈ మూవీకి కథ, మాటలు, స్క్రీన్‌ప్లేలను దర్శకుడు సంపత్ స్వయంగా సమకూరుస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
