రామ్ చరణ్ "రచ్చ" రిలీజ్ డేట్
on Feb 6, 2012
రామ్ చరణ్"రచ్చ" రిలీజ్ డేట్ ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న మెగాపవర్ స్టార్ అభిమానులకు శుభవార్త. వివరాల్లోకి వెళితే మెగాసూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా, సంపత్ నంది దర్శకత్వంలో, యన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "రచ్చ". ఈ "రచ్చ" చిత్రం మార్చ్ 29 వ తేదీన కానీ, లేదా ఏప్రెల్ 5 వ తేదీన కానీ విడుదల చేయటానికి ఈ చిత్రం యూనిట్ సన్నాహాలు చేస్తూంది.
ఈ "రచ్చ" చిత్రం ఆడియో ఫిబ్రవరి 26 వ తేదీన, కర్నూల్ లో అశేష అభిమానుల సమక్షంలో విడుదల చేయటానికి నిర్ణయించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర పేరు విశ్వం అని సమాచారం. కార్ రేసుల నేపథ్యంలో ఈ చిత్రం కథ జరుగుతుందని తెలిసింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
