పూరి గురించి డాక్టర్ చెప్పిన నిజాలు
on Jul 21, 2017
డ్రగ్స్ కేసులో సిట్ అధికారులు దర్శకుడు పూరి జగన్నాధ్ ని దాదాపు ఒక రోజంతా ప్రశ్నించడం జరిగింది. ఆయన డ్రగ్స్ తీసుకుంటున్నాడా లేదా? కెల్విన్ తో అతనికున్న సంబంధం ఏంటి? లాంటి పలు ప్రశ్నలు అడిగారని ప్రచారం జరుగుతుంది. సిట్ అధికారులు ప్రశ్నిస్తున్న సమయంలో పూరి జగన్నాధ్ చాలా టెన్షన్ పడ్డాడని, అతని బీపీ మరియు షుగర్ పెరిగాయని వార్తలు ప్రచురితమయ్యాయి. అయితే, ఈ కేసు విషయమై అధికారులు నియమించిన ఉస్మానియా హాస్పిటల్ డాక్టర్ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను పూరి నుండి 5 మిల్లి లీటర్ల బ్లడ్ శాంపిల్, 50 జుట్టు తంతువులు, అన్ని కాలు మరియు వేళ్ళ నుండి గోర్లు తీసుకున్నానని... అవన్నీ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ కి పంపించానని చెప్పారు. అధికారులు ప్రశ్నిస్తున్న సమయంలో పూరి మానసిక, ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ, ఆయన అసలు వత్తిడికి లోనవలేదని... బీపీ, షుగర్ కూడా నార్మల్ గానే ఉన్నాయని... ఆయన డ్రగ్స్ తీసుకున్నాడో లేదో ఇప్పుడే ఏం చెప్పలేం... అని అన్నారు. ఇదే డాక్టర్ ఇతర డ్రగ్స్ నిందితుల నుండి కూడా సాంపిల్స్ తీసుకోనున్నాడు.
Also Read