ట్రైలర్ రివ్యూ : రోగ్
on Mar 2, 2017
పూరి జగన్నాథ్ ఎన్ని ఫ్లాపులు ఇచ్చినా సరే, మరో సినిమా తీస్తున్నాడనగానే అటెన్షన్ పెరిగిపోతుంటుంది. ఎందుకంటే పూరి స్టామినా గురించి ఇప్పటికీ ఎవ్వరికీ నమ్మకాలు సడలకపోవడమే. `రోగ్` అనే టైటిల్ తో ఆసక్తి రేకెత్తించకపోయినా.. `ఇది మరో చంటిగాడి ప్రేమకథ` అనే ట్యాగ్ లైన్‌తో ఇడియట్‌ని గుర్తు చేసి అందరినీ తన వైపుకు తిప్పుకొన్నాడు. ఇషాన్ అనే కొత్త కుర్రాడ్ని ఈ సినిమాతో కథానాయకుడిగా పరిచయం చేస్తున్నాడు పూరి.
ఇప్పుడు రోగ్ ట్రైలర్ బయటకు వచ్చింది. షాట్ కటింగ్, డైలాగులు, ఫ్రేమింగ్... వీటిలో ఎప్పటిలాంటి పూరి మార్కే కనిపించింది. హీరో ఓ రోగ్.. విలన్ ఓ సైకో.. వీళ్ల మధ్యలో అందాల భామ... ఇదీ స్థూలంగా రోగ్ కథ. అనూప్ సింగ్ విలనిజంపై పూరి ఎక్కువ ఆశలు పెట్టుకొన్నాడేమో అనిపిస్తోంది. హీరో చూడ్డానికి బాగున్నాడు. స్టార్ అయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయి. హీరోయిన్లనూ పిచ్చ గ్లామర్ గా చూపించేశాడు పూరి. షో రూమ్ బళ్లేం లేవిక్కడ... అన్నీ సెకండ్ హ్యాండ్లే.. అనేది పూరి మార్క్ డైలాగ్. మరోసారి ఊర మాస్ ప్రేమకథని తీసేశాడు పూరి. మరి ఇది ఎంత వరకూ ఎక్కుతుందా?? అనేది తేలాలంటే... ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.