పూరికి ఆ ఎక్స్‌పీరియన్స్ లేదట..?
on Oct 19, 2016
టాలీవుడ్ దర్శకుల్లో పూరి జగన్నాథ్ డిఫరెంట్..ఆయన సినిమాలు తీసే విధానం దగ్గరి నుంచి హీరో, హీరోయిన్లని చూపించే విధానం వరకు అంతా స్పెషలే. ఆయన తోటి దర్శకులంతా సంవత్సరాల తరబడి సినిమాలు చేస్తుంటే..ఆయన మాత్రం సంవత్సరానికి మూడు, నాలుగు సినిమాలు తీస్తూ హిట్లు మీద హిట్లు కొడుతుంటారు. అలాగే సెంటిమెంట్ల వెంట నడిచే ఇండస్ట్రీలో పూరికి ఒక సెంటిమెంట్ ఉంది. తాను తీసే ప్రతి సినిమాకు కథను బ్యాంకాక్‌లో రాయడం ఆయనకు ఆనవాయితీగా వస్తోంది. అయితే ప్రతిదానిలో తప్పును వెతికే కొంతమంది పూరి బ్యాంకాక్ టూర్లపై సెటైర్లు పేలుస్తున్నారు. పూరి బ్యాంకాక్‌కు వెళ్లేది కథలను రాయడానికి కాదని..అమ్మాయిలతో మసాజులు చేయించుకోవడానికి అంటూ కామెంట్లు చేశారు. దీనిపై స్పందించిన పూరి ఓపెన్‌గానే క్లారిటీ ఇచ్చారు. తనకు ఏ థాయ్ గార్ల్‌తోనూ సెక్స్ అనుభవం లేదు..అక్కడ ఉండే పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు నచ్చుతాయి..థాయ్ ప్రజలు ఎప్పుడూ నవ్వుతూ ఉంటారని..అది నాకు ఇష్టమని పూరి చెప్పారు.