మనం నాగార్జున విడుదలయ్యాడు
on Mar 8, 2014
అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కలిసి నటిస్తున్న చిత్రం "మనం". ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇటీవలే విడుదల చేసారు. అయితే ఈ సినిమాలో నాగార్జున లుక్ ను విడుదల చేసారు. ఫార్మల్ సూట్ లో, బిజినెస్ మాన్ గా కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. అనూప్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇందులో నాగ్ సరసన శ్రియ, చైతు సరసన సమంత హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే ఆడియోను విడుదల చేసి, ఉగాదికి సినిమాను విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నారు.