నాగార్జున మళ్లీ 30లోకి వచ్చాడు!
on Sep 4, 2019
నాగార్జున వయసు ఎంత? 60! మొన్నీమధ్య స్పెయిన్ లో ఫ్యామిలీ మెంబర్స్, క్లోజ్ ఫ్రెండ్స్ మధ్య బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ, ఆయనకు 60 ఏళ్లు అంటే నమ్మడం కష్టమే. అందం, ఆరోగ్యం విషయంలో ఆయన పెట్టే శ్రద్ధ అటువంటిది. ఏదో మూడు నాలుగేళ్ల క్రితం 30లలో అడుగుపెట్టినట్టు ఉంటారు. నాగార్జున ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ కూడా ఇదే మాట చెబుతున్నారు. చెప్పడం కాదు చేతల్లో చూపిస్తున్నారు. 'నాగ్ టర్న్స్ 30 అగైన్' థీమ్ పార్టీ నిర్వహించారు. స్పెయిన్ లో నాగార్జున బర్త్ డే సెలెబ్రేషన్స్ కు ఇంకా శుభం కార్డు పడలేదు. నాగచైతన్య, సమంత, అఖిల్ అక్కడే ఉన్నారు. మంగళవారం జరిగిన 'నాగ్ టర్న్స్ 30 అగైన్' పార్టీలో వీరందరూ పాల్గొన్నారు. నాగార్జున 60వ పుట్టినరోజు సంబరాలు మరో రెండు మూడు రోజులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ వీకెండ్ కి ఇండియాకి వచ్చేలా నాగార్జున ప్లాన్ చేసుకున్నారట.
Also Read