'బిగ్ బాస్ 4' కోసం కింగ్‌కు భారీ రెమ్యూనరేషన్?
on Mar 14, 2020
కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన 'బిగ్ బాస్ 3' గేమ్ షో బ్లాక్‌బస్టర్ హిట్టయి హయ్యెస్ట్ టీఆర్పీలను సాధించింది. దీంతో ఈ ఏడాది జూలైలో ప్రారంభించాలనుకుంటున్న'బిగ్ బాస్ 4' సీజన్ కోసం మరోసారి నాగ్‌నే హోస్ట్‌గా చెయ్యమని స్టార్ మా నిర్వాహకులు సంప్రదిస్తున్నారు. సినిమా కెరీర్ పరంగా గత ఏడాది తరహాలోనే ఈ ఏడాది కూడా డల్‌గానే ఉన్నాడు నాగార్జున. డిజాస్టర్ మూవీ 'మన్మథుడు 2' తర్వాత ప్రస్తుతం 'వైల్డ్ డాగ్' అనే మూవీ చేస్తున్నాడు. అహిషోర్ సాల్మన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీపై బజ్ ఏమీ లేదు. గత ఏడాది 'బిగ్ బాస్ 3' ప్రసారమవుతున్న కాలంలోనే 'మన్మథుడు 2' మూవీ రిలీజైంది. ఆ సినిమా చెడ్డపేరు తెచ్చినప్పటికీ, బిగ్ బాస్ 3 హోస్ట్‌గా మాత్రం సూపర్ సక్సెసయ్యాడు నాగ్.
తన చార్మింగ్‌తో, హౌస్‌మేట్స్‌ను డీల్ చేసే విషయంలో, వాళ్లతో మాట్లాడే తీరుతో వీక్షకుల అభిమానాన్ని అమితంగా పొందాడు. అదివరకు రెండు సీజన్లకు యంగ్ స్టార్స్ జూనియర్ ఎన్టీఆర్, నాని హోస్ట్స్‌గా సక్సెసయిన దానికి మించి సక్సెసయ్యాడు. అత్యధిక టీఆర్పీలు సాధించిన ఈ షో ద్వారా స్టార్ మా యాజమాన్యం గణనీయమైన లాభాలు గడించింది. ఆ ఉత్సహాంతో బిగ్ బాస్ 4 సీజన్‌ను కూడా ఆయనతోటే చేయించాలని వాళ్లు నిర్ణయించారు. సూపర్ స్టార్ మహేశ్‌ను హోస్ట్‌గా అడుగుతున్నారంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కేవలం రూమరే అని తేలింది.
బిగ్ బాస్ 3 హోస్ట్‌గా చేయడానికి ఒక్కో ఎపిసోడ్‌కు 12 లక్షల రూపాయలను నాగ్‌కు రెమ్యూనరేషన్‌గా అందించిన నిర్వాహకులు ఈ సారి ఎపిసోడ్‌కు ఏకంగా 20 లక్షలు ఆఫర్ చేశారని సమాచారం. అంటే షో 100 ఎపిసోడ్లు నడిస్తే, నాగ్‌కు 20 కోట్లు అందుతాయన్న మాట. నాగ్ కూడా ఈ డీల్‌కు అంగీకరించినట్లు సమాచారం.
Also Read