ఐశ్వర్యరాయ్ గర్భవతి అయ్యిందా?
on Apr 28, 2014
ఇటీవలే అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య బచ్చన్ లకు ఆరాధ్య జన్మించిన విషయం అందరికి తెలిసిందే. ఆరాధ్య పుట్టిన తర్వాత త్వరలోనే ఐశ్వర్య సినిమాల్లోకి రాబోతుందనే వార్తలు వినిపించాయి. అయితే తాజాగా మరో వార్త వినిపిస్తుంది. అదేమిటంటే... ఐశ్వర్య ప్రస్తుతం గర్భవతి అని.
ఇటీవలే జరిగిన ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన ఐశ్వర్యను చూసిన ప్రతీ ఒక్కరు కూడా ఈమె గర్భవతి అయ్యిందంటు గుసగుసలు పెడుతున్నారు. కానీ ఈ వార్తలపై బచ్చన్ కుటుంబం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇటీవలే మణిరత్నం సినిమాలో నాగార్జున సరసన ఐశ్వర్య నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ ప్రాజెక్టు ఆగిపోయిన విషయం తెలిసిందే. కానీ ఈ ప్రాజెక్ట్ ఆగిపోవడానికి కారణం ఐశ్వర్య అని ఇప్పుడిపుడే అర్థం అవుతుంది. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ ఇదే నిజమైతే ఐశ్వర్య మరో రెండు, మూడు సంవత్సరాల వరకు సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చే అవకాశాలు లేనట్లే. మరి ఈ విషయంపై బచ్చన్ కుటుంబం ఎలా స్పందిస్తుందో చూడాలి.