అప్పుడు తిట్టారు... ఇపుడు పొగిడారు!
on May 2, 2014
'తను వెడ్స్ మను', 'క్వీన్', 'రివాల్వర్ రాణి' వంటి వరుస హిట్ చిత్రాలతో దూసుకెళ్తున్న బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ తన గత అనుభవాలను మీడియాతో పంచుకుంది. ఒకప్పుడు సినిమాల్లోకి పనికిరావు, మరో రెండు ఏళ్ళల్లో ఇంటిదారి పట్టాల్సిందే అంటూ కంగనాని హేళన చేసారంట. కానీ ఆ మాటలకు క్రుంగిపోకుండా ధైర్యంతో వచ్చిన ప్రతీ సినిమా చేస్తూ నిరంతరంగా శ్రమించి నేడు టాప్ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది.
ప్రస్తుతం ఈ అమ్మడికి వచ్చిన సక్సెస్ ల వలన... గతంలో ఎవరైతే విమర్శించారో వాళ్ళే ఇపుడు తనని "అధ్బుత నటి" అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారట. కానీ తానూ మాత్రం "అప్పుడు, ఇప్పుడు కష్టపడి, ఇష్టపడి మంచిగానే నటించాను. కాకపోతే అవి విజయం సాధించలేవు. ఇపుడు వరుసగా విజయాలు వస్తున్నాయి అంతే తేడా. కానీ ఇపుడు నాకు వస్తున్న ఈ విజయాలకు కారణం నా రచయితలు, దర్శకులే. వాళ్ళు మంచి పాత్రలు నాకు ఇవ్వడం వల్లనే ఇపుడు నటిగా నన్ను నేను నిరూపించుకోగలుగుతున్నాను" అని తెలిపింది.
సినీ పరిశ్రమ అంటేనే ఇలాగే ఉంటుంది మరి. విజయాలు వస్తే పొగడటం, ఫ్లాపులు వస్తే విమర్శించడం ఈ ఇండస్ట్రీలో కామన్. ఇవన్నిటిని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళినవారే మంచి స్థానంలో ఉంటారు.