కొంచెం ఎక్కువ కావాలంటున్న దీపిక
on Apr 21, 2014
ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో "బాజీరావ్ మస్తానీ" అనే చిత్రం రాబోతుందని గతకొంతకాలంగా వినిపిస్తుంది. అయితే ఈ చిత్రంలో "రామ్ లీలా" జోడి రణవీర్, దీపిక పదుకునేలు మరోసారి జతకట్టబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై దీపికా స్పందిస్తూ... "రామ్ లీలా"లో మా ఇద్దరి కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఆ సినిమా ఇచ్చిన విజయం కిక్కు అంతా ఇంతా కాదు. అయితే మళ్ళీ మేమిద్దరం కలిసి పనిచేయాలంటే అభిమానుల్లో అంచనాలు మరింత ఎక్కువ అవుతాయి. వారి అంచనాలను అందుకోవాలంటే "రామ్ లీలా" ను మించిన కథ రావాలి. కానీ "బాజీరావ్ మస్తానీ" కోసం నన్ను ఎవరు సంప్రదించలేదు. ఒకవేళ భన్సాలీ కోరితే తప్పకుండా నటిస్తాను" అని చెప్పుకొచ్చింది.