'జిల్' ఆడియో గెస్ట్ గా ప్రభాస్
on Mar 12, 2015
'లౌక్యం'వంటి సూపర్ హిట్ సినిమా తరువాత హ్యాండ్ సమ్ హీరో గోపిచంద్ చేస్తున్న సినిమా జిల్. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుతున్నాయి. ఈ సినిమా ఆడియోని ఈరోజు(మార్చి 12న) గ్రాండ్ గా రిలీజ్ అవబోతోంది. హైదరబాద్ లోజరగనున్న ఈ ఆడియోకి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిధిగా రాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా నిర్మాతలు వంశీ, ప్రమోద్ లు ప్రభాస్ కి మంచి ఫ్రెండ్స్, అలాగే గోపిచంద్ కూడా మంచి ఫ్రెండ్ కావడం వలన ఈ వేడుకకి ఆయన వస్తున్నారు. 'మిర్చి', 'రన్ రాజా రన్' లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాల తరువాత యు.వి.క్రియోషన్స్ బ్యానర్ లో వస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సినిమాకి జిబ్రాన్ సంగీతం అందించాడు. రాశిఖన్నా హీరోయిన్.