హోలీ
హోలీ

సప్తవర్ణాల కలయిక
ఒక్క తీరు గా రంగులలో
కలిసి మెలిసి పోయే సుదినం
జాతి, మత, కుల విష రంగులేవి
అంటని స్వచ్చమైన ప్రేమకు సంకేతం
రాధా మాధవుల వసంతోత్సవ
క్రీడలకు నిదర్శనం ...
తొలకరి జల్లుల వర్షం లో
తడిసి ముద్ద అయ్యే భావం
కాముడి దహనాల మధ్య
పౌర్ణమి వెలుగుల్లో
వెల్లువిరిస్తున్న స్నేహాలు
ఒకరికొకరు పంపుకునే ప్రేమ
సందేశాల తో నిండినది
ప్రాంతాలు వేరయినా
మనుషులు ఒక్కటే అంటూ
వెలిసిపోని మమతల
రంగులతో ముందుకు సాగాలి ..
ఇప్పుడు
రంగులు ఎగిరే పక్షులాంటివి
కాలాల తో పాటు గా కొంచెం కొంచెం
ప్రపంచం మొత్తం గా చుట్టి వస్తు
శాంతి కపోతాలు గా
కొత్త పండుగ తో ముందుకు వస్తున్నాయి
- పుష్యమి సాగర్
