TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
వినరా .... వినరా …. తెలుగోడా....!
- శారదా అశోకవర్ధన్
అందుకో కాలాన్ని
తెలుసుకో గతకాలపు వైభవాన్ని
వేసుకో భావికి బాటలు
బంగారు పీటలు -
ఎమ్మన్నా ఏమున్నా
నీ ఖ్యాతిని పెంచుకో
నీ జాతిని నిలబెట్టే
నీ సంస్కృతిని నిలుపుకో
నీ దేశం నీ తల్లి
నీ భాగ్యం నీ జన్మే
మరువకు ఈ సత్యం
రత్నగర్భ నీ దేశం-
ఈ రొదలూ ఈ సెగలూ
ఎప్పుడూ వుండవు
రాగాలూ ద్వేషాలూ
కలకాలం నిలవవు
కన్నతల్లి కన్నీళ్లు
కాలువలై పారకముందే
జన్మభూమి దిక్కులేక పగుళ్ళతో
బీటలు బారకముందే
పరాయి దేశపు బడాయి నీలో
పూర్తిగా ఇమడకముందే
ఎగురవెయ్ నీ జాతి జెండా
నింపుకో ఔన్నత్వం నీ గుండెనిండా