విధి వ్రాతను తప్పించుకోవడం ఎవరికీ సాధ్యపడదు అనడానికి నిదర్శనం ఈ కథ. ఒక దొంగ దొంగతనం చేయడానికి ఒక ఇంటికి కన్నం పెట్టి, లోపలికి ప్రవేశించడానికి చూస్తుంటాడు. ఇంతలో ఆ కన్నం గుండా ఒక నల్లత్రాచు లోపలికి వెళ్లి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళను కాటు వేసి చంపి మెల్లగా దొంగ పక్కనుంచే అతనిని ఏమీ చేయకుండా వెళ్తుంటే ఆశ్చర్య పడిన దొంగ, అలాగే చూస్తుండగానే కొద్దిదూరం వెళ్లిన ఆ నల్లత్రాచు ఒక పెద్ద వృక్షంగా మారుతుంది .
Apr 28, 2024
కన్నావరంలోని చింతామణి రోగనిర్ధారణకూ, చికిత్సకూ, హస్తవాసికీ పేరుగాంచిన వైద్యుడు. అయితే, యేటా వేసవిలో ఆ చుట్టు పక్కల గ్రామాల ప్రజలను పట్టి పీడించే వింత కంటి జబ్బును నయం చేయలేక బాధపడసాగాడు.
Apr 27, 2024
రామనాధం గొప్ప ధనవంతుడు. ఆయనకు చుట్టుప్రక్కల పట్టణాల్లో కర్మాగారాలు, వ్యాపారాలున్నాయి. వాటి నుండి మంచి లాభాలను గడిస్తున్నాడు.
Apr 25, 2024
వందకు ఒకటి తక్కువ! (చందమామ కథ)
చందన్, నందన్ ఇరుగుపొరుగున నివసించేవారు. చందన్ ధనిక వర్తకుడు. కాని నందన్ పొద్దున లేచి వెళ్ళి కాయకష్టం చేస్తే తప్ప పూట గడవని పేదవాడు. చందన్‌కు అన్నిసంపదలూ ఉన్నప్పటికీ అవసరాలకు మించి దమ్మిడీ ఖర్చు పెట్టడు.
Apr 22, 2024
అమ్మా ! కొట్టవద్దే తట్టుకోలేక పోతున్నా. ఆపవే అమ్మా రేపటి నుంచి బాగా చదువుతాను. నువ్వు చెప్పినట్లే వింటాను నిద్రలోనే సునీల్ కలవరిస్తుంటే గభాలున లేచి వాడి దగ్గరకు వెళ్ళాడు రాంబాబు.
Apr 17, 2024
నారాయణపురంలోని భూస్వామి వెంకటాద్రి కొడుకు సింహాచలం తెలివైనవాడే గాని పరమ బద్ధకస్తుడు. కూర్చుని తింటే కొండలయినా కరిగిపోతాయి. చెమటోడ్చి కష్టపడకపోయినా దగ్గరుండి పనులు చేయించవచ్చుకదా అని తండ్రి ఎంత చెప్పినా సింహాచలం పొలంకేసి వెళ్ళేవాడు కాడు.
Apr 16, 2024
ఒక రైతు నడుస్తూ పట్నం వెళుతున్నాడు. అతని జేబులో ఒక రాయి, ఒక అయిదు రూపాయల నాణెం ఉన్నాయి. నాణెం కొత్తది. తళతళమని మెరిసి పోతోంది. అది నల్లగా గరుకుగా ఉన్న రాయిని చూసి చిరాకు పడింది.
Apr 8, 2024
మగధ రాజ్యాన్ని మణివర్మ పాలించినంత కాలం ప్రజలను కన్న బిడ్డల్లాగా చూసుకున్నాడు. తమకీ అలాంటి రాజు ఉంటే బాగుంటుందని పొరుగు రాజ్య ప్రజలు భావించేలా ఆయన పరిపాలన ఉండేది. అంతటి మంచి పేరున్న రాజు మణివర్మ హఠాత్తుగా చనిపోవడంతో యువరాజు కీర్తివర్మని రాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేశారు.
Apr 4, 2024
ప్రముఖ ఆంగ్ల రచయిత చార్లెస్ డికెన్స్ తన సుప్రసిద్ధ నవల ఏ టేల్ ఆఫ్ టూ సిటీస్ ను అది అత్యుత్తమ కాలం, అది మహా చేటుకాలం , అది ఆశల వసంతం (స్ప్రింగ్), అడియాసల శిశిరం (వింటర్), అనే వాక్యంతో ఆరంభించాడు. ఫ్రెంచి విప్లవం రోజులను దృష్టిలో పెట్టుకొని డికెన్స్ అలా స్పందించాడని అంటారు.
Mar 30, 2024
ఓమ్ భూర్భువస్సువః తత్సవితు ర్వరేణ్యం భర్గో దేవస్య థీమహి థియో యోనః ప్రచోదయాత్ అని తాతగారి గదిలోంచి వినిపిస్తున్న గాయత్రీ మంత్రాన్ని విని వినోద్, వనజా నవ్వుకున్నారు.
Mar 29, 2024
అతడొక బీదవాడు. బీదరికం నుంచి విముక్తి పొందాలన్నది అతడి తీవ్రమైన కోరిక. ఒక భూతాన్ని వశపరచుకొంటే దాని ద్వారా కోరినదంతా తెచ్చుకోవచ్చుననుకొన్నాడు. సమీపంలోని అడవిలో ఆ వశీకరణ మంత్రాన్ని అనుగ్రహించే మహాత్ముడున్నాడని తెలుసుకొని వెళ్లి, అతడి కాళ్లమీద పడ్డాడు.
Mar 23, 2024
ఒక గ్రామంలో నారాయణ అనే పేద వ్యవసాయదారు ఉండేవాడు. అతడు చాలా తెలివైనవాడే కాని, అతనికంటూ సొంతంగా కుంటెడు పొలం కూడా లేదు. అందువల్ల ఇతరుల పొలాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసి జీవించేవాడు. అతనికి రెండు తీరని కోరికలుండేవి. ఒకటి దేశాటన చెయ్యటం, రెండోది రుచికరమైన రాజ భోజనం తినాలని. అయితే అవి అతని వంటి పేద రైతుకు తీరే కోరికలు కావు.
Mar 22, 2024
ధర్మనిరతుడైన గోకర్ణికరాజు మణికర్ణుడికి యోగిపుంగవులన్నా, సాధు సన్యాసులన్నా అమిత గౌరవం. ఆయన తరచూ మహనీయులైన యోగులను దర్శించి వారి ఆశీర్వాదం పొందేవాడు. రాజధానికి వచ్చే సాధు సన్యాసులను సాదరంగా ఆహ్వానించి భక్తి శ్రద్ధలతో అతిథి సత్కారాలు చేసేవాడు.
Mar 15, 2024
సత్యసంధ (శ్రీమద్రామాయణంలోని కథ)
మునివేష ధారులైన శ్రీరామ సీతా లక్ష్మణులు శరభంగముని ఆశ్రమము చేరిరి. శ్రీ రాముని కమనీయ దివ్యమంగళ స్వరూపమును చూచుచూ శరభంగుడు శరీర త్యాగము చేసి విష్ణుపదమును చేరెను. అనంతరము దండకారణ్యములో నివసించు మునీశ్వరులందరూ శ్రీ రామ చంద్రుని దర్శనార్థం శరభంగ ముని ఆశ్రమమునకు వచ్చినారు.
Mar 6, 2024
వినుకొండరాజు నరేంద్రుడి ఏకైక కుమార్తె వైజయంతి. బాల్యంలోనే తల్లిని కోల్పోయిన ఆమెను తండ్రి అల్లారుముద్దుగా పెంచి రాజోచితవిద్యలు నేర్పించాడు. యుక్తవయస్కురాలైన వైజయంతిని చక్కని రాజకుమారుడికిచ్చి త్వరలో వివాహం జరిపించే ఆలోచనలో ఉన్నాడు నరేంద్రుడు.
Mar 5, 2024
సారంగపట్నంలో ఆనందాచారికి ఒక పెద్ద బంగారు నగల దుకాణం ఉన్నది. ఆ దుకాణం ఆయనకు తాత తండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తి కాదు. ఆయన కష్టార్జితం. ఆయన చిన్నవయసులోనే తల్లిదండ్రులు చనిపోతే, జీవనోపాధికి ఒక నగల దుకాణంలో పనికి కుదిరాడు.
Mar 4, 2024
అనుభవం నేర్పిన పాఠం (చందమామ కథ)
ఒకప్పుడు కొరియా దేశాన్నేలే రాజుకు ఇద్దరు కుమారులు. రెండవ కుమారుణ్ణి, తనకు పిల్లలు లేరని అతడి మేనమామ దత్తు తీసుకున్నాడు. అయితే, పదేళ్ళ తరవాత, రాజుగారి పెద్ద కుమారుడు ప్రపంచాన్ని త్యజించి, సన్యాసం స్వీకరించి ఇల్లువిడిచి వెళ్ళిపోయాడు. రెండవ కుమారుణ్ణి దత్తు తీసుకున్న మేనమామకు కొడుకు పుట్టాడు. దాంతో, దత్త కుమారుడి పట్ల ప్రేమ తగ్గడంతో, అతడు సొంత తండ్రి అయిన రాజు వద్దకు తిరిగి వచ్చేశాడు.
Feb 29, 2024
ఒక ఊళ్ళో శివనాధుడనే యువకుడు ఉండేవాడు. వాడు చాలా అల్లరివాడు. అందుచేత వాడంటే ఊళ్ళో ఎవరికీ పడేదికాదు. వాడికి చదువు అంటలేదు. ఒకసారి ఒక గొప్ప జ్యోతిష్కుడు వచ్చి, ఊరి మధ్యన గల మర్రిచెట్టు కింద మకాం పెట్టాడు. తన భవిష్యత్తు ఎలా ఉండేదీ తెలుసుకుందామని శివనాధుడు కూడా వచ్చి జ్యోతిష్కుడికి తన చెయ్యి చూపించాడు.
Feb 23, 2024
సత్రం యజమాని పేరాశ (చందమామ కథ)
పాండ్యరాజులు పాలించే కాలంలో మధుర సంపదలతో తులతూగే నగరంగా ప్రసిద్ధిగాంచింది. ఆ కాలంలో చిన్నసామి అనే వీధులు ఊడ్చేవాడు ఉండేవాడు. వేకువ జామునే లేచి రాజు దైవదర్శనానికి వచ్చే మార్గాన్ని శుభ్రంగా చిమ్మడం వాడి పని. రాజు జోడు గుర్రాల బంగారు రథంలో దేవాలయానికి వచ్చేవాడు. ఆయనకు ముందు ఇద్దరు అంగరక్షకులు గుర్రాలపై వచ్చి మార్గాన్ని పరిశీలించేవారు.
Feb 16, 2024
ముగ్గురు రాజకుమారులు (చందమామ కథ)





















