మాయదారి జబ్బు (చందమామ కథ)

సారంగపట్నంలో ఆనందాచారికి ఒక పెద్ద బంగారు నగల దుకాణం ఉన్నది. ఆ దుకాణం ఆయనకు తాత తండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తి కాదు. ఆయన కష్టార్జితం. ఆయన చిన్నవయసులోనే తల్లిదండ్రులు చనిపోతే, జీవనోపాధికి ఒక నగల దుకాణంలో పనికి కుదిరాడు.

Mar 4, 2024

అనుభవం నేర్పిన పాఠం (చందమామ కథ)

ఒకప్పుడు కొరియా దేశాన్నేలే రాజుకు ఇద్దరు కుమారులు. రెండవ కుమారుణ్ణి, తనకు పిల్లలు లేరని అతడి మేనమామ దత్తు తీసుకున్నాడు. అయితే, పదేళ్ళ తరవాత, రాజుగారి పెద్ద కుమారుడు ప్రపంచాన్ని త్యజించి, సన్యాసం స్వీకరించి ఇల్లువిడిచి వెళ్ళిపోయాడు. రెండవ కుమారుణ్ణి దత్తు తీసుకున్న మేనమామకు కొడుకు పుట్టాడు. దాంతో, దత్త కుమారుడి పట్ల ప్రేమ తగ్గడంతో, అతడు సొంత తండ్రి అయిన రాజు వద్దకు తిరిగి వచ్చేశాడు.

Feb 29, 2024

అదృష్టవంతుడు (చందమామ కథ)

ఒక ఊళ్ళో శివనాధుడనే యువకుడు ఉండేవాడు. వాడు చాలా అల్లరివాడు. అందుచేత వాడంటే ఊళ్ళో ఎవరికీ పడేదికాదు. వాడికి చదువు అంటలేదు. ఒకసారి ఒక గొప్ప జ్యోతిష్కుడు వచ్చి, ఊరి మధ్యన గల మర్రిచెట్టు కింద మకాం పెట్టాడు. తన భవిష్యత్తు ఎలా ఉండేదీ తెలుసుకుందామని శివనాధుడు కూడా వచ్చి జ్యోతిష్కుడికి తన చెయ్యి చూపించాడు.

Feb 23, 2024

సత్రం యజమాని పేరాశ (చందమామ కథ)

పాండ్యరాజులు పాలించే కాలంలో మధుర సంపదలతో తులతూగే నగరంగా ప్రసిద్ధిగాంచింది. ఆ కాలంలో చిన్నసామి అనే వీధులు ఊడ్చేవాడు ఉండేవాడు. వేకువ జామునే లేచి రాజు దైవదర్శనానికి వచ్చే మార్గాన్ని శుభ్రంగా చిమ్మడం వాడి పని. రాజు జోడు గుర్రాల బంగారు రథంలో దేవాలయానికి వచ్చేవాడు. ఆయనకు ముందు ఇద్దరు అంగరక్షకులు గుర్రాలపై వచ్చి మార్గాన్ని పరిశీలించేవారు.

Feb 16, 2024

ముగ్గురు రాజకుమారులు (చందమామ కథ)

రత్నగిరి రాజు రాజభూషణుడు ధర్మప్రభువుగా పేరుగాంచాడు. ఆయన పాలనలో ప్రజలు ఏ కొరతా లేకుండా సుఖశాంతులతో జీవించేవారు. ఆయనకు ముగ్గురు కుమారులు. ముగ్గురూ యుక్త వయస్కులయ్యారు. వారిలో ఒకరిని త్వరలో రాజ్యాభిషిక్తుణ్ణి చేయవలసి వుంది.

Feb 16, 2024

భగవంతుడిని అర్ధం చేసుకోవడం ఎలా?

లోకంలో చాలా ఘాతుకాలు జరుగుతుంటాయి. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తుంటాయి. ఇవన్నీ భగవంతుడు చేస్తున్నవేనా? వీటన్నింటికీ కారణం ఎవరు? చాలామంది భగవంతుడు నిర్దయుడు, ఇన్ని జరుగుతుంటే చూస్తూ ఉంటున్నాడు, జరగకుండా ఆపవచ్చు కదా అంటుంటారు. ఇదెలా సాధ్యం?

Jan 29, 2024

మా సెడ్డ మంచోడు దేవుడు!

ఓసారి బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి ఒక చిన్న పల్లెటూరికి షూటింగ్ కు వెళ్ళారు, షూటింగ్ సమయంలో కాస్త గ్యాప్ రావడంతో పక్కనే ఉన్న శివాలయానికి వెళ్ళారు.

Jan 25, 2024

అత్యాశ (చందమామ కథ)

కుముద్వతీ రాజ్యం పొలిమేరలో ప్రవహించే కుముదినీ నదీ తీరంలో సుప్రసిద్ధమైన సోమశేఖర ముని ఆశ్రమం ఉండేది. అక్కడ గురుకుల ఆశ్రమాన్ని నడిపే సోమశేఖర ముని శిష్యులకు వివిధ ధ్యాన పద్ధతులను బోధించడంతోపాటు, చిత్రలేఖనంలో కూడా సిద్ధహస్తుడు. మనుషులను చూసి యథాతథంగా చిత్రించడంలో అద్భుతమైన ప్రతిభ కనబరచేవాడు.

Jan 24, 2024

దయ్యం వదిలింది.. చందమామ కథలు

వాణీ, వర్మలకు సంతానం లేదు. వాళ్లు చాలా మంచివాళ్లు. ఎదుటివాళ్ళకు సాయపడడంలో ఆనందం పొందేవారు. ఆ ఊళ్లో వాళ్ళ మంచితనాన్ని గురించి చెప్పుకోనివారు లేరు. ఒక రోజురాత్రి పెద్దవర్షం పడుతున్నది. వర్మా, వాణీ భోజనానికి కూర్చోబోతుండగా ఎవరో దడదడా తలుపులు తట్టారు. తలుపు తీసి చూస్తే, వర్షంలో తడిసి ముద్ద అయి ఉన్న యువదంపతులు కనిపించారు.

Jan 23, 2024

ప్రాణ ప్రతిష్ట అంటే ఏమిటి?

హిందూధర్మంలోని ఆచారాల ప్రకారం ఏదైనా దేవాలయంలో దేవుని విగ్రహ ప్రతిష్టకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్టించకుంటే దేవుని ఆరాధన అసంపూర్ణమవుతుందని అంటారు.

Jan 22, 2024

సంక్రాంతి విశిష్టత ఏంటో తెలుసా?!

సంక్రాంతి అంటే పెద్ద పండుగ. పంటల పండుగ. పెద్దల పండుగ. పశువుల పండుగ. పుడమి పుస్తకంలో ప్రకృతి రాసుకున్న మధురమైన కవిత.

Jan 16, 2024

తెలుగు సాహిత్యంలో తొలి మానవవాది ‘కవిరాజు’

మల మల మాడుపొట్ట, తెగ మాసిన బట్ట కలంత పెట్టగా విలవిల ఏడ్చుచున్న నిరుపేదకు జాలిని జూపకుండా నుత్తల పడిపోయి జీవ రహితంబగు బొమ్మకు నిండ్లు, వాకిళల్‌ పొలమును బొట్ర నిచ్చెడి ప్రబుద్ధుల నిచ్చమెచ్చెదన్‌.

Jan 15, 2024

నీతి కథ

ఒక రైతు దగ్గర ఒక కుక్క వుండేది. అది చానా ముసలిదైపోయింది. గమ్మున పెట్టింది తిని ఏదో ఒక మూలన పడుకొని నిద్ర పోయేది. చురుకుదనం బాగా తగ్గిపోయింది. అది చూసి ఆ రైతు పెళ్ళాంతో ఏమే ఈ కుక్క చానా ముసలిదై పోయింది. కాపలా కూడా సరిగా కాయడం లేదు. ఇది వున్నా ఒకటే లేకున్నా ఒకటే. ఇక దీనికి తిండి పెట్టడం పెద్ద దండగ. కాబట్టి తీసుకుపోయి ఎక్కడైనా దూరంగా పక్కనున్న అడవిలో వదిలేసి వస్తా అన్నాడు. ఆమె సరే అని తలూపింది.

Jan 11, 2024

మానవుడే అన్నింటికీ ప్రమాణం!

కమ్యూనిస్ట్‌లు, కాంగ్రెస్‌వారూ భారతీయులంతా బ్రిటిష్‌ వారితో పోరాడి స్వాతంత్య్రం సాధిస్తే, స్వతంత్ర పోరాటంలో సంబంధంలేనివారు ఈ రోజు జాతీయత పేరుతో మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు. - తీస్తా సెతల్వాద్‌, పౌరహక్కుల కార్యకర్త.

Jan 8, 2024

మాయ నియమించుకున్న సేవకురాలు అజ్ణానం!

అజ్ఞానం ఆనందాన్ని కలిగిస్తుందా? ఒక వేళ అది నిజమే అయితే ఆ ఆనందం ఎప్పటివరకు నిలుస్తుంది? కృష్ణుడు అర్జునుడి అజ్ఞానాన్ని తొలగించడానికి ఎన్నో విధాలుగా భోదచేస్తాడు.

Jan 8, 2024

ప్రజలు నిజాన్ని మార్చలేరు.. నిజమే ప్రజల్ని మారుస్తుంది!

నేను నమ్మినట్టు నమ్ము లేకపోతే దేవుడు నిన్ను శిక్షిస్తాడు అంటూ ఇవ్వాళ నిన్ను భయపెట్టేవాడు రేపు నేను నమ్మినట్టు నమ్ము లేకపోతే నేను నిన్ను చంపేస్తాను అని తప్పక బెదిరిస్తాడు. అందుకు అతను ఏమాత్రం వెనుకాడడు అని అన్నాడు భావ విప్లవ జ్వాలలు రగిలించిన వోల్టేర్‌

Jan 8, 2024

తౄప్తి!

ఒక ఊరిలో నలుగురు స్నేహితులు ఉండేవారు. సమాన లక్షణాలున్న వారందరూ ఒకే చోట చేరటం సహజం. వీరందరూ ఆగర్భ దరిద్రులు. నిలవడానికి నీడ లేకుండా ఒక పూట తింటే మరోపూట పస్తుండేవారు.

Jan 6, 2024

నేను పోతే..?

భోజ మహారాజు ఒకనాడు తన ఆస్థాన పండితులతో మోక్షానికి పోగలిగే వాడెవ్వడు?"అని ప్రశించాడట.

Jan 2, 2024

మనసు బుద్ధి

మనసు బుద్ధి నియంత్రణలో ఉంటే అది మంచి సేవకురాలు. మనసే బుద్ధిని నియంత్రిస్తే అది ఒక నియంత. అది పాదరసం లాగా చురుకైనది. చేతికి దొరికినట్లే ఉంటుంది, కానీ తేలికగా జారిపోతుంది. భవబంధాలకు మోక్షానికి, రాగానికి ద్వేషానికి, భయానికి ధైర్యానికి, సంకల్ప వికల్పాలకు, శాంతికి అశాంతికి.... అన్నింటికీ మూలం మనసు.

Dec 29, 2023

నిజమైన తోడు

ఓ రైలు ప్రయాణంలో ఓ ఊరు వెళుతుండగా నేను కూర్చున్న భోగీలో నాసీటు కింద కాళ్లదగ్గర ఒక పాత నలిగిపోయిన పర్సు కనిపించింది. దానిని పైకి తీశాను.అందులో కొద్దిపాటి నోట్లు ఒక కృష్ణుడిఫోటో తప్ప ఏమీ లేవు.

Dec 27, 2023