ముకుందపురంలో అరవిందుడు అనే యువకుడు వ్యవసాయం చేసుకుంటూనే, గ్రామాభివృద్ధికి ఇతోధికంగా సేవ చేసేవాడు. ఆ గ్రామస్తులు నిత్యమూ గోదావరి మధ్య ఉన్న లంకలో పనులకు వెళ్లి వస్తూండేవారు. గ్రామానికీ ఏటి గట్టుకూ నడుమ కాలువ ఉంది. ఆ కాలువను దాటడానికి తాటిచెక్క వంతెనలా వేయబడింది. ఆ తాటి వంతెన పైన నడుస్తూ అప్పుడప్పుడూ కొందరు కాలు జారి కాలువలో పడిపోవడం కద్దు.
Jul 25, 2024
ఒకరోజు వశిష్ఠుడు విశ్వామిత్రుని ఆశ్రమానికి వచ్చాడు. ఇద్దరూ అనేక విషయాలపై మాట్లాడుకున్నారు.
Jul 18, 2024
ఒక రాజ్యంలో ఓ అత్యంత తెలివైనవాడుండేవాడు. అతని పేరు సుబ్బన్న. తెలివైనవాడే కానీ తృప్తి, ఆనందం అనే మాట తెలీని వాడు. ఎవరిని చూసినా తానే వాడికంటే గొప్ప అనుకునే నైజం. దీంతో సుబ్బన్న అహంభావి అనేవారు కొందరు. ఇవేమీ పట్టించుకునేవాడు కాదు సుబ్బన్న.
Jul 13, 2024
ఒక అడవిలో పెద్ద సింహం ఒకటి ఉండేది. ఆ అడవికి రాజుగా అది పెత్తనం చెలాయిస్తూ ఉండేది. ఆ అడవిలోనే చిట్టెలుక కూడా ఉండేది. ఒకరోజు సింహం చెట్టు క్రింద పడుకొని ఉండగా, పక్క ఉన్న కన్నంలోనుంచి చిట్టెలుక అటూ, ఇటూ పరుగెత్తుతూ సింహం కాలుపై ఎక్కింది.
Jul 6, 2024
మహా భారతంలో ఎన్నో సంఘటనలు, ఉంటాయి. ప్రతి కథా మన జీవితానికి ముఖ్యమయిన ఎన్నో విషయములను మనకు తెలియ చేస్తుంది. వాటిలో ఒకటి సక్తుప్రస్తుడు కథ.
Jul 3, 2024
స్వార్థంలో నిస్వార్థం (విక్రమాదిత్య కథలు)
పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగివెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్నిదించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు.
Jun 25, 2024
ఒకానొకప్పుడు మహాసేనుడనే రాజు భారతదేశం అంతా జయించి చక్రవర్తి అయ్యాడు. మహాసేనుడికి ఓడిన రాజులందరూ అతనికి సామంతులై, అతని నిర్ణయాలను బట్టి పరిపాలించసాగారు. సామ్రాజ్యం స్థాపించటానికి ఎన్నో యుద్ధాలు చేసినప్పటికీ మహాసేనుడు ప్రజాకంటకుడు కాడు. పైగా, ప్రజాక్షేమం గురించి ఆయన చాలా శ్రద్ధగా ఆలోచించేవాడు. అందుకొరకు అనేక ప్రణాళికలు వేసి, సామ్రాజ్య మంతటా అమలు జరిపించేవాడు.
Jun 24, 2024
గడపలో వాలు కుర్చీలో కూర్చొని దినపత్రిక చదువుతున్న సీతారాం గారి ఇంటి ముందు మంచినీళ్ల బాటిల్స్ వ్యాన్ ఆగింది. ఒక కుర్రాడు వచ్చి ఇరవై లీటర్లున్న బాటిల్ అరుగు మీద పెట్టి వెళ్లిపోయాడు.
Jun 19, 2024
ఒకానొకప్పుడు సౌరాష్ట్రంలో ఒక క్షత్రియుడు ఉండేవాడు. బతికినంత కాలం ప్రజలను పీడించుకు తిన్నాడు. నిస్సహాయులైన ప్రజలు అతడిని నేరుగా ఏమీ అనలేక లోలోపలే అతడిని తిట్టుకునేవారు. అతడి ప్రస్తావన వస్తేనే చాలు, చీత్కరించుకునేవారు. జన్మలో ఎలాంటి పుణ్యకార్యం చేయని ఆ క్షత్రియుడు కాలం తీరి మరణించాడు. పూర్వజన్మ పాపకర్మల ఫలితంగా బ్రహ్మరాక్షసుడిగా జన్మించాడు.
Jun 17, 2024
శృంగవరం ప్రక్కనే ఉన్న దట్టమైన అడవుల్లో ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసేవాడు ముని శతానందుడు. ఆ ఆశ్రమం చుట్టూ ఎన్నో పూల మొక్కలు, పండ్ల చెట్లు, పొదలు పెరిగాయి. అడవిలో కంటే ముని ఆశ్రమం చుట్టూ బాగుండడంతో ఆ ప్రశాంత వాతావరణానికి అలవాటు పడ్డాయి జంతువులు. అక్కడకు వచ్చి విశ్రాంతి తీసుకునేవి.
Jun 13, 2024
ఆ రోజుల్లో అమలాపురం నుంచి రాజమండ్రి వెళ్ళడానికి రెండు మార్గాలు అందుబాటులో ఉండేవి. అమలాపురంలో బస్సెక్కి, బొబ్బర్లంక రేవు దాటి ఆలమూరు మీదుగా వెళ్ళడం ఒకటి, లేదా ముక్తేశ్వరం వచ్చి, రేవు దాటి కోటిపల్లి మీదుగా రాజమండ్రి చేరడం మరొకటి.
May 31, 2024
అనగా అనగా మంచుకొండల వద్ద ఒక గ్రామం వుండేది.అ వూళ్ళో వనమయ్య అనే ఆసామి వుండేవాడు.అది చలికాలం వనమయ్యా,అతని స్నేహితులూ యింట్లోనే కుంపటి చుట్టూ కూచుని చలి కాచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వున్నారు.అందరూ తమ తమ ధైర్య సాహసాల గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు.వనమయ్య వూరికే వింటూ కూర్చున్నాడు.
May 28, 2024
ముకుందపురంలో అరవిందుడు అనే యువకుడు వ్యవసాయం చేసుకుంటూనే, గ్రామాభివృద్ధికి ఇతోధికంగా తన వంతు సేవ చేసేవాడు. ఆ గ్రామస్తులు నిత్యమూ గోదావరి మధ్య ఉన్న లంకలో పనులకు వెళ్లి వస్తూండేవారు. గ్రాగమానికీ ఏటిగట్టుకూ నడుమ కాలువ ఉంది. ఆ కాలువను దాటడానికి తాటిచెక్క వంతెనలా వేయబడింది. ఆ తాటి వంతెన పైన నడుస్తూ అప్పుడప్పుడూ కొందరు కాలు జారి కాలువలో పడిపోవడం కద్దు.
May 24, 2024
శంకరాపురానికి క్రొత్తగా వచ్చిన టీచర్ శేఖర్. కొద్దికాలంలోనే పిల్లల్ని, గ్రామ పరిస్థితిని గ్రహించాడు....
May 20, 2024
కురు పాండవ యుద్ధం ముగిసిన తరువాత ధర్మరాజు హస్తినాపురానికి వస్తున్నాడని తెలిసి పట్టణమంతా అందంగా అలంకరించారు. రాజవీధిలో ప్రవేశించిన ధర్మరాజు మీద, పరివారం మీద ప్రజలు ముత్యాలూ, అక్షింతలూ, పూలూ చల్లారు. అవన్నీ స్వీకరిస్తూ ధర్మతనయుడు రాజమందిర ద్వారంలోంచి లోపలికి వెళ్ళి ఏనుగు మొగసాలలో రథం దిగాడు.
May 10, 2024
కర్ణుడిని కృష్ణుడు ఎప్పుడు పడితే అప్పుడు దానకర్ణుడని అభివర్ణించడం అర్జునుడికి నచ్చలేదు. కృష్ణుడితో అర్జునుడు వాదనకు దిగుతాడు. ఈ విషయమై వీరి మధ్య చాలాసేపే మాటలు సాగాయి.
May 7, 2024
ప్రతివారూ వివేకవంతులే, అవివేకులు ఈ ప్రపంచంలో వుండడు. ఈ వివేకవంతులూ మూడు రకాలుగా వుంటారు. ప్రథములకు అసలు ప్రశ్నయే పుట్టదు, ద్వితీయులకు ప్రశ్న కలుగుతుంది, కానీ సమాధానం స్ఫురించదు, ఉత్తములకు ప్రశ్న పుట్టిన వెంటనే సమాధానం స్ఫురిస్తుందనేవారు విశ్వనాథసత్యనారాయణ గారు.
May 4, 2024
కాకడ దేశాన్నేలే కృష్ణ భూపతి పట్టపు రాణి జ్యోత్స్నాదేవి. రాజ దంపతులిరువురూ రాజోచిత విద్యల్లో దాదాపు సమ ఉజ్జీలుగా ఉండేవారు. భానుదేశాధీశుడి ఏకైక కుమార్తె అయిన జ్యోత్స్నాదేవి అందచందాల్లో, గుణగణాల్లో, మేధస్సులో సాటిలేని మేటి అని విన్న కృష్ణభూపతి, ఆమెను ఏరి కోరి వివాహం చేసుకున్నాడు.
May 2, 2024
ప్రాణం మీదికి వచ్చిన విద్య (చందమామ కథ)
క గ్రామంలో శరభుడు అనే పశువుల కాపరి ఉండేవాడు. వాడి ఆస్తి అంతా కలిసి నాలుగు ఆవులు. వాడు వాటిని రోజూ మేతకు తీసుకుపోయి, ఏ చెట్టు మీదనో, గుట్టమీదనో కూర్చుని వేణువు ఊదుకుంటూ కాలక్షేపం చేసేవాడు.
May 1, 2024
సిరా చుక్కలతో కలిపి అగ్గి రాజేసిన యుగకర్త శ్రీశ్రీ



















