నా‘వ’ఛాయ
నా"వ"ఛాయ
బతుకు నావ
ప్రవాహపు నీటిలో
అలుపెరగని పయనం
సాగుతూ ఉంటే
నీడకి నిరాశకి ఉనికి
ఎక్కడిది ??
కెరటం ఎటు పోతే
అటు వెంట కదిలిపోతూ
వెంటాడటమేగా
నీడ పని !!
బ్రదిమి నీడల మయం
చెట్టు ఛాయో
గరిక పొడనో కానీ
నీడ సత్యమేగా !!
మది పొడ అందరిలో కానరాదు
కానీ అపుడపుడూ
గతపు నీడలు కొన్ని
రేయి మాటున
కమ్ముతాయి ఏకాంతంలో !!
రెప్పల మాటు
దాగిన ఆ నీడల ప్రవాహం
మూసిన కళ్ళకు కానరాదు !!
రెక్కలు తొడిగిన ఆశ
నిశ్శబ్దాల నీడకు
విరియని పెదవులేగా మాటు !!
ప్రేమకి నీడ లేదు
తోడు మాత్రమే కావాలి
కాదని మొరాయిస్తే
ప్రేమకి విడిదీ లేదు !!
వెలుగు నీడ రెండూ
ప్రేమ నాణేనికి బొమ్మా బొరుసులు ...!!
రచన: కవిత రాయల
