రాజకీయ రాబందులు
చిచ్చుపెట్టినోళ్ళొకరు
రెచ్చగొట్టె వాలింకొకరు
ఉద్యోగుల జీవితాన్ని
చిన్నాబిన్నంచేసిన
జీ.వో. ఇచ్చినోళ్ళు
జీ.వో. అమలుజేసేటోళ్ళు
స్థానికతంటూ
వేతనజీవులందరిని
వేదనకు గురిజేసినోళ్ళే
ఆ...ఇద్దరూ
సమయంలేదు మిత్రమా
అంటూ
గొంతుమీద కత్తుంచిన తుగ్లకొకరు
తప్పంటూ నిరసనదెలిపే
మేకవన్నె పులులొకరు
ఉద్యామాల్జేసి సాధించిన
తెలంగాణ గడ్డంతా
దొరలచేతుల్లో ధగాపడుతున్నది
ఏంజేసినగని ఎప్పుడైనా
సామాన్యులే బలిపశువులై
అసువులుబాసేది
కొత్తజిల్లాలంటూ
తెలంగాణనంతా మూప్పైమూడూ ముక్కల్జేసిరి
ఉద్యోగాలేయలేక
నిరుద్యోగులకు ఉపాదిలేక
కాలయాపనతో కాలమెల్లదీసే
కపటదారులచేతుల్లో
అధికారం సైతం తలదించుకుని తటపటాయిస్తూ తల్లడిల్లిపోతంది
మార్పైతే రేపటితీర్పు
కాలమాగదులే ఉప్పెనై తరమక తప్పదులే
గమనిస్తునే వర్తమానం సాగుతున్నది
భవిష్యత్తుకది బాటకాకమానదులే
సి. శేఖర్
