Facebook Twitter
ప్రకృతి ప్రతిరూపమేగురవేసే విజయకేతనం


ప్రకృతి ప్రతిరూపమేగురవేసే విజయకేతనం

 

 

మలయమారుత వీచికయై  
హాయి గొలుపుతూ సాగడమే కాదు,
సుడిగాలి సందడయి, ఉక్కిరిబిక్కిరి చెయ్యటమూ,

      మధుర సువాసనల గులాబియై
      సొగసులు వెదజల్లటమే కాదు,
      మొగ్గమాటున ముల్లై, కసుక్కున గుచ్చటమూ
 
గగనవీధిన మందగమన
మేఘమాలలా తెలియాడడమే కాదు,
ఫెళఫెళ మెరుపుల, గర్జనలు ఝుళిపించడమూ

     నునులేత సిగ్గుల సుకుమారవదన,
     వయ్యారములొలుకు స్త్రీగా మాత్రమే కాదు,
     అపరచండీ చాముండియై,  శక్తియుక్తులనుపయోగించడమూ

ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు పంచె
సఖి, అర్దాంగి, మాతృమూర్తియే కాదు,
సభ, సంఘ, దేశరక్షణ ల్లో పాత్ర వహించడమూ

“ప్రకృతి ఫ్రతిరూప”మై నేర్చితినేన్నెన్నెన్ని గనుకనే,
     కుటుంబవ్యవస్థలో కీళిక నాడినై
     రాజకీయ రంగంలో మంత్రినై
     విద్యాబోధనలో గురువునై
     శస్త్రచికిత్సలో వైద్యురాలనై
     యుద్ధవిమాన రథసారథినై  
     సైన్యవిన్యాసంలో సిద్దహస్తనై…
     అదియిదియని లేక అన్ని రంగముల
“మహిళా విజయ” పతాకమేగురవేస్తున్నా  

-  కవిత బేతి