Facebook Twitter
భారతీయత

 

అవును నేను భారతీయు...ని !!
బ్రతుకు తెరువులో ఉన్న
ఆడంబరాలకై దేశం దాటాను !!
అయనా భారతీయత
మరిచిపోలేక నా దేశం లో
లోపాలన్నీ కనిపిస్తున్నాయి !!
సుచి శుభ్రం తెలియని దేశం !!
కానీ అందులో ఉద్భవించిన
పంకజాలు ఎన్నో ,
మబ్బులు కమ్మిన
నా కళ్ళకు కానరాలేదు !!
ఆడవారి స్వేచ్ఛను హరించి
వంటఇంటి కుందేలులుగా
మార్చిన దేశం అనుకుంటున్న
నేను మాత్రం విహంగమై
విహరిస్తున్న భారతీయు...ని !!
భారత పౌరసత్వం
వదులుకున్నను ఒకప్పటి
భారతీయు...ని మరి !!
అబ్బో అక్కడ.....
లంచం దానికి వేస్తుంది
పెద్ద మంచం !!
జనులంతా వెర్రి గొర్రెలు
నా దృష్టిలో,అయ్యయ్యో
మరిచాగా ఆ మందలో
నేను ఒక గొర్రెనే అనే సంగతి !!
ఓటు హక్కు లేదు అక్కడ కానీ
బ్రష్టు పట్టిన కుల రాజకీయం
అనే దౌర్భాగ్యం నా సొంతం !!
ఆభివృద్ధికి ఉపన్యాసాలే
ఇవ్వగలిగిన కొంతమందిలో
నేను ప్రథమం...!!

- కవిత రాయల